Lokamanta veligindani | లోకమంతా వెలిగిందని | Christmas jesus Song Lyrics Telugu
ఆనందం సంతోషం
ఆనందం సంతోషం మన హృదిలో ఉత్సవం (2)
నీతి సూర్యుడొచ్చాడని లోకమంతా వెలిగిందని (2) ((ఆనందం))
చరణం:
1. లోక పాపమంతయు వీపుపై మోయుటకు తానే దిగివచ్చాడు
అంధకార బంధకాలు అంతరింప చేయుటకు ఆశ్చర్యకరుడైనాడు (2)
నెరవేరే ప్రవచనమే రక్షకుడు పుడతాడని
ధన్యమాయే ధరనిఅంతా యేసయ్యను పూజింపగను (2)
నీతి సూర్యుడొచ్చాడని లోకమంతా వెలిగిందని (2) ((ఆనందం))
2. నరకమును తప్పించి నరులను కాపాడా నరునిగా జన్మించాడు
మహిమలో చేర్చుటకు జీవమునే ఇచ్చుటకు మానవుడై ఇలా పుట్టాడు (2)
ఆశ్రయమే ఆధారమే అందరికి ప్రభుడాయెనే
భూజనమా హృదినివ్వుమా అదియేగా నిజమైన క్రిస్మస్ (2)
నీతి సూర్యుడొచ్చాడని లోకమంతా వెలిగిందని (2) ((ఆనందం))