LEKINCHALENI SONG | లెక్కించలేని స్తోత్రముల్ | Telugu Christian Song Lyrics
లెక్కించలేని స్తోత్రముల్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (2)
ఇంత వరకు నా బ్రతుకులో
నువ్వు చేసిన మేళ్ళకై (2) ||లెక్కించలేని||
1. ఆకాశ మహాకాశముల్
దాని క్రిందున్నా ఆకాశము (2)
భూమిపై కనబడునవన్ని
ప్రభువా నిన్నే కీర్తించున్ (2) ||లెక్కించలేని||
2. అడవిలో నివసించువన్ని
సుడిగాలియు మంచును (2)
భూమిలో ఉన్నవి అన్ని
దేవా నిన్నే పొగడును (2) ||లెక్కించలేని||
3. నీటిలో నివసించు ప్రాణుల్
ఈ భువిలోన జీవ రాసులు (2)
ఆకాశమున ఎగురునవన్ని (2)
ప్రభువా నిన్నే కీర్తించున్ ||లెక్కించలేని||