నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము | NAA BRATHUKU DHINAMULU | Telugu Christian Song Lyrics - Download

నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము | NAA BRATHUKU DHINAMULU | Telugu Christian Song Lyrics - Download

నా బ్రతుకు దినములు

నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము

దేవా ఈ భువినివీడు గడియ నాకు చూపుము 

ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము 

నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము 


ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి 

నా ఆశలు నాకలలనే వెంబడించుచుంటిని 

ఫలాలులేని వృక్షమువలె ఎదిగిపోతిని 

ఏనాడు కూలిపొదునో యెరుగకుంటిని 

నా మరణ రోదన ఆలకించుమో ప్రభు 

మరల నన్ను నూతనముగా చిగురువేయనీ 

 

నీ పిలుపునేను మరిచితి నా పరుగులో నేనలసితి 

నా స్వార్ధము నా పాపము పతనస్థితికి చేర్చెను 

నా అంతమెటుల నుండునో భయము పుట్టుచున్నది 

దేవా నన్ను మన్నించుము  నా బ్రతుకు మార్చుము 

యేసు నీచేతికి ఇక లొంగిపోదును 

విశేషముగా రూపించుము నా శేషజీవితం