యుగాలలో తరాలలో సజీవుడైన దేవుడవు | Yugalalo taralalo sajivudaina devudavu | Telugu Christian Song Lyrics | Download
పల్లవి :
యుగాలలో తరాలలో సజీవుడైన దేవుడవు నీవే యేసయ్యా
నిత్యము ఉండేది ఈ లోకములో లేదు
శాశ్వతముండేది నీ రాజ్యము యేసయ్యా
నన్ను చేర్చుటకు నీ మార్గము చూపావు
అర్హత పొందుటకు నీ రక్తము కార్చావు
చరణం:
1. లోకములో ఏ శ్రమలైనా నీవుంటే పోయెనుగా
బాధలలో నేనున్నా నీ వైపే చూస్తే తీరునుగా
నీవే లేకుంటే నేనేమైపోతానో
నీవే రాకుంటే నేనేమై ఉంటానో
నీవే తోడుంటే అదియే చాలయ్యా
నీవే నాకుంటే ఇంకెంతో మేలయ్యా
2. పాపములో చెడివున్న పరిశుద్ధుడవై నన్ను తాకావు
నీ రక్తముతో నా దోషములు తొలగించి ఆత్మతో నింపావు
నీ ప్రాణము పోకుంటే నా జీవము ఏమౌనో
నీ త్యాగము లేకుంటే ఈ రక్షణ ఏమౌనో
నీ కృపయే లేకుంటే ఈ బ్రతుకే లేదయ్యా
నీజాలే లేకుంటే ఇక నేనే లేనయ్యా
3. ఒక మానవుడై భువిపై జీవించి ప్రతి శోధనలో జయమును పొందావు
ప్రతి శత్రువుపై ప్రేమను చూపించి నిజ ప్రేమికుడై ఇలలో నిలిచావు
నీ జయమే లేకుంటే నా విజయం ఏమౌనో
నీ ప్రేమే లేకుంటే ఈ ప్రాయం ఏమౌనో
నీ కరుణే లేకుంటే ఈ కాలం లేదయ్యా
నీ దయనే లేకుంటే ఈ ధన్యత రాదయ్యా