మిత్రుడా రారమ్ము - మైత్రితో పార | Mitruda Rarammu | Telugu Christian song Lyrics | Download

Mitruda Rarammu | మిత్రుడా రారమ్ము - మైత్రితో పార | Telugu Christian song Lyrics

మిత్రుడా రారమ్ము

    
మిత్రుడా రారమ్ము - మైత్రితో పార - మార్ధికమైన - మాటల్ వచింతు - మన్ననతో విను|| మిత్రు || 

1. పూర్వజన్మము నందు - పూర్తిగా పాపిని అందుకె యీ బాధ -పొందుచున్నాను - అనియిట్లు 
    మనస్సులో - అనుకొననే వద్దు -అది నిజమే యైన - అదికూడ పోగొట్టు రక్షకుడున్నాడు - తత్ 
    క్షణమెరమ్ము - ఆయన మానవుడైనట్టి దేవుండు ఈ మాట నమ్మిన - ఎంత ధన్యుండవు =
    మనస్సులో ముద్రించు - కొని శాంతి పొందుము    || మిత్రు || 

2. ఈ జన్మమునుగూడ - ఎన్నెన్నో పాపాలు చేసియున్నందున - చివరకు నరకంబె అని 
    ఆత్మయందున - ఆలోచనెందుకు అవి సిల్వపైయేసు అంతరింపజేసి ఆ వృత్తాంతంబును - 
    ఆనందముగ నమ్మి సుఖముగ నుండుము - సూక్ష్మమార్గంబిది ఎంద రెన్నియన్న ఏమాటల్వి
    నవద్దు = దేవవాక్కె నిజము - దిక్కులుచూడకు    || మిత్రు || 

3. తల్లిదండ్రుల్ చేసిన - తగని కార్యంబులు నామీదికె పొర్లి - నను జంపుచున్నవి ఆ శాపమును
    నేను - అడ్డగింపలేను అని పల్కుచును నీవు - అదరిపోకూడదు పాపమని తెలియని - పాపాలు
    ఎన్నెన్నో చేయబట్టి యిన్ని - చిక్కులు ననుజుట్టె అని లేని పోనట్టి వనుకొనకుండుము = నీ
    పాపములకంటె - నీ తండ్రి దయ గొప్ప.    || మిత్రు || 

4. నీ పాపశాపాలు - నీ సర్వవ్యాధులు మోసికొన్నట్టి శ్రీ - యేసు దేవుడు ముందె నీకీడు పోగొట్టి - 
    నీకెన్నియో మేళ్ళు సంపాదనము చేసె - సర్వోపకారుడు దేవుండు మానవుడు దివిలోన భువిలోన
    - నినుబట్టి పాపివి - నినుజూడనేవద్దు ప్రభు యేసునిబట్టి - పరిశుద్ధుడవు నీవు = ఆయనను
    జూచిన - అంతయు సరియౌను    || మిత్రు || 

5. ఇంటిలోనిపోరు - ఇంకిపోవునుగాక - వాదాలు బేదాలు - వాడి పోవునుగాక కలహాలు నీటను 
    కలిసిపోవునుగాక యుద్ధాలు క్రమముగ ఉడిగిపోవునుగాక - అన్ని పాపాలును అంతరించునుగాక 
    - సర్వ దేశములందు - శాంతికలుగునుగాక నాగరికత ప్రతి - నరుని కబ్బునుగాక దేవున  
    మ్రొక్కుట - తేజరిల్లునుగాక ఆయన బోధలె -అలుము కొనునుగాక ప్రజలందరికిని దైవ - భక్తి
    పెరుగునుగాక మంచిజీవిని - కనికరించు చుందురుగాక పాడిపంటలు ప్రతి - వాని కుండునుగాక
    వెలుగు, నీరు, గాలి - కలుగజేసిన తండ్రి = మనయందరివలన - ఘనత నొందునుగాక!
                                                                                                                                                    || మిత్రు || 

6. దివ్యదేవుడు నిన్ను - దీవించునుగాక భూమి చేసినవాడు - పోషించును గాక రక్షకుండౌ క్రీస్తు - 
    రక్షించునుగాక పరమ వైధ్యుడు స్వస్థ పరచుచుండును గాక పనులన్నిటిని - సఫల - 
    పరచుచుండునుగాక దైవాత్మ ధైర్యంబు-తెచ్చుచుండునుగాక అంతాన మోక్షంబు 
    -అందజేయునుగాక = విజయము ఈ పాట -వినువారికామెన్    || మిత్రు ||