నిత్యము స్తుతించినా | Nithyamu stuthiyinchina | Telugu Christian Song lyrics | Download

నిత్యము స్తుతించినా | Nithyamu stuthiyinchina | Telugu Christian Song lyrics

నిత్యము స్తుతించినా

    నిత్యము స్తుతించినా 

    నీ ఋణము తీర్చలేను 

    సమస్తము నీకిచ్చినా 

    నీ త్యాగము మరువలేను (2) 


    రాజా రాజా రాజాధి రాజువు నీవు 

    దేవా దేవా దేవాది దేవుడవు (2)           ||నిత్యము|| 


1. అద్వితీయ దేవుడా 

    ఆది అంతములై యున్నవాడా (2) 

    అంగలార్పును నాట్యముగా 

    మార్చివేసిన మా ప్రభు (2)                  ||రాజా|| 


2. జీవమైన దేవడా 

    జీవమిచ్చిన నాథుడా (2) 

    జీవజలముల బుగ్గ యొద్దకు 

    నన్ను నడిపిన కాపరి (2)                    ||రాజా|| 


3. మార్పులేని దేవుడా 

    మాకు సరిపోయినవాడా (2) 

    మాటతోనే సృష్టినంతా 

    కలుగజేసిన పూజ్యుడా (2)                   ||రాజా||