రాజాధి రాజా రారా | Rajaadhi Raaja Raa Raa | Telugu Christian Song Lyrics | Download
రాజాధి రాజా రారా
రాజాధి రాజా రారా – రాజులకు రాజువై రారా
రాజయేసు రాజ్యమేల రారా – రవికోటి తేజ యేసు రారా
ఓ …. మేఘ వాహనంబు మీద వేగమే
ఓ …. మించు వైభవంబు తోడ వేగమే
1. ఓ … భూ జనంబు లెల్ల తేరి చూడగా –
ఓ …. నీ జనంబు స్వాగతంబు నీయగా
నీ రాజ్య స్థాపనంబు సేయ – భూ రాజులెల్ల గూలి పోవ –
భూమి ఆకసంబు మారిపోవ
నీ మహా ప్రభావమున వేగ
2. ఆ … ఆకసమున దూత లార్భటింపగా –
ఆ … అది భక్త సంఘ సమేతంబుగా
ఆకసంబు మధ్య వీధిలోన ఏకమై మహా సభ జేయ –
యేసు నాధ! నీదు మహిమ లోన – మాకదే మహానంద మౌగ
3. ఓ … పరమ యెరుషలేము పుణ్య సంఘమా –
ఓ … గొఱ్ఱియ పిల్ల క్రీస్తు పుణ్య సంఘమా –
పరమ దూతలార! భక్తులారా! పౌలపోస్తులార! పెద్దలారా!
గొఱ్ఱియ పిల్ల యేసు రాజు పేర – క్రొత్తగీతమెత్తి పాడ రారా