ఈలాటిదా యేసు ప్రేమ | Eelaatidaa Yesu Prema | Telugu Christian Song Lyrics | Download

telugu christian songs,ఈలాటిదా యేసు ప్రేమ,christian songs,eelatida yesu prema | andhra kraisthava keerthanalu | dr. betty sandesh | telugu christian song,christian songs telugu,christian telugu songs,telugu christian song,eelatida yesu prema song lyrics,elatida yesu prema lyrics,telugu christian songs latest,jesus telugu songs,christian telugu america,telugu christian paatalu,best christian telugu songs,must watch telugu christian songs

ఈలాటిదా యేసు ప్రేమ

    ఈలాటిదా యేసు ప్రేమ -నన్ను 

    తూలనాడక తనదు జాలి చూపినదా       ||ఈలాటిదా||

 

1. ఎనలేని పాప కూపమున – నేను 

    తనికి మిణుకుచును నే దరి గానకుండన్ 

    కనికరము పెంచి నాయందు – వేగ 

    గొనిపోవ నా మేలు కొరికిందు వచ్చె        ||ఈలాటిదా|| 


2. పెనుగొన్న దుఃఖాబ్ధిలోన – నేను 

    మునిగి కుములుచు నేడు పునగుండు నపుడు 

    నను నీచుడని త్రోయలేక – తనదు 

    నెనరు నా కగుపరచి నీతి జూపించె         ||ఈలాటిదా|| 


3. నెమ్మి రవ్వంతైనా లేక – చింత 

    క్రమ్మిపొగలుచు నుండ-గా నన్ను జూచి 

    సమ్మతిని నను బ్రోవ దలచి – కరము 

    జాచి నా చేయి బట్టి చక్కగా పిలిచె         ||ఈలాటిదా|| 


4. పనికిమాలిన వాడనైన – నేను 

    కనపరచు నా దోష కపటవర్తనము 

    మనసు నుంచక తాపపడక యింత 

    ఘనమైన రక్షణ-మును నాకు చూపె         ||ఈలాటిదా|| 


5. నా కోర్కెలెల్ల సమయములన్ – క్రింది 

    లోక వాంఛల భ్రమసి లొంగెడు వేళన్ 

    చేకూర్చి ధృడము చిత్తమునన్ – శుభము 

    నా కొసంగె జీవింప నా రక్షకుండు          ||ఈలాటిదా|| 


6. శోధనలు నను చుట్టినప్పుడు – నీతి 

    బోధ నా మనసులో పుట్టించి పెంచి 

    బాధలెల్లను బాపి మాపి – యిట్టి 

    యాదరణ జూపిన యహాఁహాఁ యేమందు        ||ఈలాటిదా||