నీవు చేసిన ఉపకారములకు | Neevu Chesina Upakaaramulaku | Telugu Christian Song Lyrics | Download

telugu christian songs,latest telugu christian songs,neevu chesina upakaaramulaku,నీవు చేసిన ఉపకారములకు,నీవు చేసిన ఉపకారములకు -,neevu chesina upakaramulaku,new telugu christian songs,christian songs,telugu christian songs latest,neevu chesina upakaramulaku song,christian songs telugu,latest telugu christian songs lyrics,telugu christian songs 2021,telugu christian song,jesus songs telugu

నీవు చేసిన ఉపకారములకు

నీవు చేసిన ఉపకారములకు 

నేనేమి చెల్లింతును (2) 

ఏడాది దూడెలనా… వేలాది పోట్టేల్లనా (2) ||నీవు చేసిన|| 


వేలాది నదులంత విస్తార తైలము 

నీకిచ్చినా చాలునా (2) 

గర్భ ఫలమైన నా జేష్ట్య పుత్రుని 

నీకిచ్చినా చాలునా (2)                    ||ఏడాది|| 


మరణపాత్రుడనైయున్న నాకై 

మరణించితివ సిలువలో (2) 

కరుణ చూపి నీ జీవ మార్గాన 

నడిపించుమో యేసయ్యా (2)            ||ఏడాది|| 


విరిగి నలిగిన బలి యాగముగను 

నా హృదయ మర్పింతును (2) 

రక్షణ పాత్రను చేబూని నిత్యము 

నిను వెంబడించెదను (2)       ||ఏడాది|| 


ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు 

నీకేమి చెల్లింతును (2) 

కపట నటనాలు లేనట్టి హృదయాన్ని 

అర్పించినా చాలునా (2)                          ||ఏడాది||