వందనంబొనర్తుమో ప్రభో | Vandanambonarthumo | Telugu Christian Song Lyrics | Download

telugu christian songs,latest telugu christian songs,christian songs,jesus songs telugu,jesus telugu songs,telugu jesus songs,popular christian songs,non stop christian songs,top christian songs,best christian songs,christian songs 2020,telugu christian songs latest,christian music,famous christian songs,new telugu christian songs 2018 download,christian,christmas songs,new christian,latest telugu christian songs lyrics

వందనంబొనర్తుమో ప్రభో ప్రభో

వందనంబొనర్తుమో ప్రభో ప్రభో 

వందనంబొనర్తుమో ప్రభో ప్రభో 

వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా 

వందనంబు లందుకో ప్రభో                  ||వందనం|| 


ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు 

గన్న తండ్రి మించి ఎపుడు గాచియు 

ఎన్నలేని దీవెన లిడు నన్న యేసువా 

యన్ని రెట్లు స్తోత్రములివిగో                ||వందనం|| 


ప్రాత వత్సరంపు బాప మంతయు 

బ్రీతిని మన్నించి మమ్ము గావుము 

నూత నాబ్దమునను నీదు నీతి నొసగుమా 

దాత క్రీస్తు నాథ రక్షకా                       ||వందనం|| 


దేవ మాదు కాలుసేతు లెల్లను 

సేవకాలి తనువు దినములన్నియు 

నీ వొసంగు వెండి పసిడి జ్ఞానమంత నీ 

సేవకై యంగీకరించుమా                     ||వందనం|| 


కోతకొరకు దాసజనము నంపుము 

ఈ తరి మా లోటుపాట్లు దీర్చుము 

పాతకంబు లెల్ల మాపి భీతి బాపుము 

ఖ్యాతి నొందు నీతి సూర్యుడా                ||వందనం|| 


మా సభలను పెద్దజేసి పెంచుము 

నీ సువార్త జెప్ప శక్తి నీయుము 

మోసపుచ్చు నందకార మంత ద్రోయుము 

యేసు కృపన్ గుమ్మరించుము             ||వందనం||