కొనియాడ తరమే నిన్ను | Koniyaada Tharame Ninnu | Telugu Christian Song Lyrics | Download

telugu christian songs,new telugu christian songs,latest telugu christian songs,christian songs,koniyada tharame ninnu song lyrics,christian telugu songs,telugu christmas songs,koniyada tharame ninnu lyrics,koniyaada tharame ninnu,koniyada tharame ninnu,telugu christian songs 2023,telugu christian song koniyada tharame,koniyada tharame ninnu song download,koniyada tharame ninnu song free download,koniyada tharame ninnu song

కొనియాడ తరమే నిన్ను

కొనియాడ తరమే నిన్ను 

కోమల హృదయ – కొనియాడ తరమే నిన్ను 

తనరారు దినకరు – బెను తారలను మించు (2) 

ఘన తేజమున నొప్పు – కాంతిమంతుడ వీవు        ||కొనియాడ|| 


కెరుబులు సెరుపులు – మరి దూత గణములు (2) 

నురుతరంబుగ గొలువ – నొప్పు శ్రేష్ఠుడ వీవు        ||కొనియాడ|| 


సర్వ లోకంబుల – బర్వు దేవుడ వయ్యు (2) 

నుర్వి స్త్రీ గర్భాన – నుద్భవించితి వీవు        ||కొనియాడ|| 


విశ్వమంతయు నేలు – వీరాసనుడ వయ్యు (2) 

పశ్వాళితో దొట్టి – పండియుంటివి వీవు        ||కొనియాడ|| 


దోసంబులను మడియు – దాసాళి కరుణించి (2) 

యేసు పేరున జగతి – కేగుదెంచితి నీవు        ||కొనియాడ|| 


నరులయందున కరుణ – ధర సమాధానంబు (2) 

చిరకాలమును మహిమ – పరగ జేయుదు వీవు        ||కొనియాడ|| 


ఓ యేసు పాన్పుగ – నా యాత్మ జేకొని (2)

శ్రేయముగ పవళించు – శ్రీకర వరసుత        ||కొనియాడ||