నీవే నా దేవుడవు | NEEVE NAA DEVUDAVU | Telugu Christian Song Lyrics | Download | Youtube Release
నీవే నా దేవుడవు నిన్నారాధింతును
నీవే నా దేవుడవు నిన్నారాధింతును
నీవే నా ప్రభుడవు
నిన్నాశ్రయింతును (2)
నీవు నాతోనే ఉండగ నాలోనే ఉండగా నాకేలా భయమయ్య
నీవు నా చెంతచేరగ నా బాధ తీర్చగా నాకేలా దిగులయ్య
యేసయ్య స్తోత్రమయ నీకే యేసయ్య
ఆరాధన ఆలాపన నీకే యేసయ్య (2)
1. మనసారా నిన్ను కీర్తింతున్
మదిలోనే రారాజువని (2)
ఆశ్చర్యకరుడవు నీవు ఆలోచన కర్తవు
నిత్యుడగు తండ్రివి సమాధానకర్తవు (2)
యేసయ్య స్తోత్రమయ నీకే యేసయ్య
ఆరాధన ఆలాపన నీకే యేసయ్య (2)
2. ఊపిరిగా నిన్ను ప్రేమింతున్
నా ఊహలలో నిన్ను ధ్యానింతున్ (2)
ఊహకుఅందని వాడవు ఉన్నతమైన దేవుడవు
ఉల్లసించు వాడవు నీవొక్కడివే నిజ దేవుడవు (2)
యేసయ్య స్తోత్రమయ నీకే యేసయ్య
ఆరాధన ఆలాపన నీకే యేసయ్య (2)