రేగత్వరపడకు ఓర్చుకో | Rega Thwarapadaku | Telugu Christian Song Lyrics | Download
రేగత్వరపడకు ఓర్చుకో
రేగత్వరపడకు ఓర్చుకో
కోపి గోడుజెందును ఓర్చుకో
నీ కన్యాయమయినను కన్ను లెర్రజేయకు (2)
శాంత మొందు మెప్పుడు ఓర్చుకో (2) ||రేగ||
1. ఎవ్వడేమి తిట్టిన ఓర్చుకో
మేలుఁజేయు కీడుకు ఓర్చుకో (2)
లోకమందు సుఖము కొంతసేపు నుండును (2)
కోపమేలఁ జేతువు? ఓర్చుకో. (2) ||రేగ||
2. నీవు కీడునొందగా ఓర్చుకో
ప్రతి కీడుఁ జేయకు (2)
ఓర్చుకొనియుండుము అంత సరియగును (2)
నీకు జయముండును ఓర్చుకో (2) ||రేగ||