సాక్ష్యమిచ్చెద మన | Saakshyamichcheda | Telugu Christian Song Lyrics | Download

telugu christian songs,latest telugu christian songs,christian songs,telugu jesus songs,christian songs 2020,best christian songs,non stop christian songs,jesus telugu songs,jesus songs telugu,jesus songs in telugu,christian,top christian songs,christian songs telugu,telugu christian worship songs,new telugu christian songs,christian song,christian music,new christian,famous christian songs,telugu christian old songs,christmas songs

సాక్ష్యమిచ్చెద మన

సాక్ష్యమిచ్చెద మన స్వామి యేసు దేవుడంచు 

సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను దెల్పుటయే 

సాక్ష్య మిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించె నంచు              ||సాక్ష్య|| 


దిక్కు దెసయు లేని నన్ను దేవుడెంతో కనికరించి 

మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతి నిచ్చినడో                    ||సాక్ష్య|| 


పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నా పైని గలదు 

పిల్లలకును బెద్దలకును బ్రేమతో నా స్వానుభవము              ||సాక్ష్య|| 


బోధ చేయలేను వాద ములకు బోను నాక దేల 

నాధు డేసు ప్రభుని గూర్చి నాకు దెలసినంత వరకు              ||సాక్ష్య|| 


పాపులకును మిత్రుడంచు బ్రాణ మొసగి లేచెనంచు 

బాపముల క్షమించు నంచు బ్రభుని విశ్వసించు డంచు          ||సాక్ష్య|| 


చోరు లైన జారు లనా చారు లైన నెవ్వరైన 

ఘోరపాపు లైన క్రీస్తు కూర్మితో రక్షించు నంచు                     ||సాక్ష్య|| 


పరమత దూషణము లేల పరిహసించి పలుకు టేల 

ఇరుగు పొరుగు వారి కెల్ల యేసు క్రీస్తు దేవు డంచు                ||సాక్ష్య|| 


ఎల్లకాల మూరకుండ నేల యాత్మ శాంతి లేక 

తల్లడిల్లు వారలకును తండ్రి కుమా రాత్మ పేర                       ||సాక్ష్య||