శ్రీ రక్షకుండు పుట్టగా | Shree Rakshkumdu Puttagaa | Telugu Christian Song Lyrics | Download

telugu christian songs,latest telugu christian songs,christian songs,telugu jesus songs,andhra christian songs telugu,andhra christian telugu old songs,andhra christian hymns telugu songs,jesus songs telugu,christian songs 2020,christian telugu songs,andhra christava keerthanalu telugu songs,andhra christava keerthanalu telugu songs jukebox,jesus telugu songs,non stop christian songs,telugu christian song,christian telugu america,christian telugu messages

శ్రీ రక్షకుండు పుట్టగా

శ్రీ రక్షకుండు పుట్టగా నాకాశ సైన్యము 

ఇహంబున కేతెంచుచు ఈ పాట పాడెను. 

‘పరంబునందు స్వామికి మహా ప్రభావము 

ఇహంబునందు శాంతిని వ్యాపింపనీయుడు’. 


ఆ రమ్యమైన గానము ఈ వేళ మ్రోగును 

సంతుష్టులైన భక్తులు ఆ ధ్వని విందురు 

ప్రయాసపడు ప్రజల దుఃఖంబు తీరగా 

ఆ శ్రావ్యమైన గానము ఈ వేళ విందురు. 


పూర్వంబు దూతగానము భువిన్ వినంబడి 

రెండువేల వర్షములు గతించిపోయెను 

భూప్రజలు విరోధులై యుద్ధంబు లాడి యా 

మనోజ్ఞమైన గానము నలక్ష్యపెట్టిరి. 


పాపాత్ములారా, వినుఁడి శ్రీ యేసు ప్రభువు 

విూ పాపభార మంతయు వహింప వచ్చెను 

తాపత్రయంబు నంతయు దానే వహించును 

సంపూర్ణ శాంతి సంపద లను గ్రహించును. 


సద్భక్తులు స్తుతించిన ఈ సత్యయుగము 

ఈ వేళ నే నిజంబుగా సవిూప మాయెను 

ఆ కాలమందు క్షేమము వ్యాపించుచుండును 

ఆ దివ్య గాన మందఱు పాడుచు నెప్పుడు.