క్రీస్తుయేసుకు మంగళం | KREESTHU YESUKU MANGALAM | Telugu Christian Jesus Song Lyrics | Andhra Kristhava Keerthanalu | Download

క్రీస్తు యేసుకు మంగళం,KREESTHU YESUKU MANGALAM,bekind,christian songs,christian songs 2020,christian music,gospel music,worship,non stop christian songs,new christian,jesus,christian song,jesus songs,god songs,jesus music,telugu jesus songs,christian,jesus telugu songs,latest telugu christian songs,jesus songs in telugu,telugu christian songs,new songs,christmas songs,famous christian songs,jesus songs telugu,2020,hosanna ministries

క్రీస్తుయేసుకు మంగళం

క్రీస్తుయేసుకు మంగళం మా కీర్తి రాజుకు మంగళం 

క్రీస్తుయేసే దైవమంచును కూడి పాడుదు మంగళం  ||క్రీస్తుయేసుకు|| 


1. ప్రవచనంబులు బల్కినట్టి ప్రాణనాధుడవీవె నీదు (2) 

    స్తవము జేయుచు మెలగు మనుజుల సత్ప్రభువుకిదె మంగళం ||క్రీస్తుయేసుకు|| 


2. జగమునేలెడు జీవనాధుడ జపములందెడు గృపకటాక్ష 

    అగణీ తంబగు ప్రేమజూపిన అమరతేజుడ మంగళం ||క్రీస్తుయేసుకు|| 


3. ఖలుల బ్రోచెడు కనికరాత్మ కేంద్ర స్థానము నీ పదాబ్జము (2) 

    కలుషమును కడమార్చినట్టి సిలువ నాధుడ మంగళం ||క్రీస్తుయేసుకు|| 


4. మనము గోరెడు మా హృదీశుడ మార్గదర్శుడ వీవెగావ (2) 

    అనయము నినుగొల్చు జనముల ఆది దేవుడ మంగళం  ||క్రీస్తుయేసుకు|| 


5. జనకసుత శుద్ధాత్మ దేవుడ గనని వినని ప్రేమ పూర్ణుడ (2)

    తనివితీరగ పాడుదము యీ ధాత్రి నీకగు మంగళం ||క్రీస్తుయేసుకు||