నా హృదయములో నీ మాటలే | Naa hrudayamulo nee maatale | Telugu Chrisitan Song Lyrics | Download
నా హృదయములో నీ మాటలే
నా హృదయములో నీ మాటలే
నా కనులకు కాంతి రేఖలు (2)
కారు చీకటిలో కలువరి కిరణమై
కఠిన హృదయమును కరిగించిన
నీ కార్యములను వివరింప తరమా
నీ ఘన కార్యములు వర్ణింప తరమా (2) ||నా హృద||
మనస్సులో నెమ్మదిని కలిగించుటకు
మంచు వలె కృపను కురిపించితివి (2)
విచారములు కొట్టి వేసి
విజయానందముతో నింపినావు
నీరు పారేటి తోటగా చేసి
సత్తువ గల భూమిగా మార్చినావు ||నీ కార్యములను||
విరజిమ్మే ఉదయ కాంతిలో
నిరీక్షణ ధైర్యమును కలిగించి (2)
అగ్ని శోధనలు జయించుటకు
మహిమాత్మతో నింపినావు
ఆర్పజాలని జ్వాలగా చేసి
దీప స్తంభముగా నను నిలిపినావు ||నీ కార్యములను||
పవిత్రురాలైన కన్యకగా
పరిశుద్ధ జీవితము చేయుటకు (2)
పావన రక్తముతో కడిగి
పరమానందముతో నింపినావు
సిద్ధపడుచున్న వధువుగా చేసి
సుగుణాల సన్నిధిలో నను నిలిపినావు ||నీ కార్యములను||