నీదు సన్ని ధానమందు | Needhu Sanni Dhaanammdhu | Telugu Christian Song Lyrics | Andhra Kristhava Keerthanlu | Download
నీదు సన్ని ధానమందు
1. నీదు సన్ని ధానమందు
ఓ నా యేసురక్షకా
నాదు నాత్మ చేరి యందు
నెంత తృప్తి పొందును
ఎంత శ్రేష్ఠమైన బోధ
నేను నేర్చుకొందును
నీతి మార్గమందు నడ్వ
నెంత ధైర్య మొందుదున్!
2. లోక ధనాపేక్షయైన
నన్ను మోసపుచ్చదు
ఇహ దుఃఖబాధ లెన
నన్ను భయపర్చవు
నా విరోధియైన సాతాన్
నన్ను వెంబడించినన్
నీదు సన్నిధానమందు
యేసు నన్ను దాగనీ.
3. యేసు శరణంబువల్ల
కల్గు మధురంబును
నీవు రుచిచూడ వాంఛ
నీకు గల్గి యున్నదా?
యేసు శరణంబు జొచ్చు
మిది నీకు లాభము
ఆయన స్వరూప మిట్లు
నీకు గూడ గల్గును.