పాపినైనా నన్ను వెదకి | Papinaina nannu vedaki raksinncavu | Telugu Christian Latest Song Lyrics | Download
పాపినైనా నన్ను వెదకి రక్షించావు
పాపినైనా నన్ను వెదకి రక్షించావు
నశించిన నన్ను వెదకి రూపు దిద్దావు (2)
ఏమిచ్చి నీరుణం నే తీర్చగలను
ఏమిచ్చి నేను నిన్ను దర్శించగలను (2)
అందుకో దేవా నా దీన స్తుతులు
అందుకో దేవా నా దీన ప్రార్థన (2) ||పాపి||
పేమ అనే మాయలో పడిపోయాను
మత్తు అనే ముసుగులో చెడిపోయాను (2)
పడిపోయిన నన్ను లేవనేత్తవు
చెడిపోయిన నన్ను చేరదిసావు
మాలినమైన నా బ్రతుకు శుద్ధి చేశావు (2)
అందుకో దేవా నా దీన స్తుతులు
అందుకో దేవా నా దీన ప్రార్థన (2) ||పాపి||
పాపమనే ఊభిలో మునిగి పోయాను
జూదమనే ఆటలో జారిపోయాను (2)
దిగాజారిన నన్ను లేవనేత్తావు
మోక్షమే లేని నాకు మోక్షమిచ్చావు
హీన మైన నా బ్రతుకును మహిమగా మార్చావు (2)
అందుకో దేవా నా దీన స్తుతులు
అందుకో దేవా నా దీన ప్రార్థన (2) ||పాపి||
నీచుడనైనా నన్ను నిలువ బెట్టావు
గౌరవం లేని నాకు అధికారమిచ్చావు (2)
చనిపోయిన నన్ను బ్రతికించావు
నీ ప్రేమతో నన్ను బందిని చేసావు
పాడయినా నా బ్రతుకును పరిమళంగా చేసావు (2)
అందుకో దేవా నా దీన స్తుతులు
అందుకో దేవా నా దీన ప్రార్థన (2) ||పాపి||