దేవ లోకమునుండి ఉయ్యాలో | Deva Lokamunundi Uyyalo | Christmas Song Lyrics Telugu | Bible Mission Songs Lyrics | Download
SONG NO. 22
దేవ లోకమునుండి ఉయ్యాలో
దేవ లోకమునుండి ఉయ్యాలో దేవదూతలు వచ్చి రుయ్యాలో
1. దేవలోకం బెల్ల ఉయ్యాలో........ తేజరిల్లిపోయె ఉయ్యాలో
2. గగన మార్గంబెల్ల ఉయ్యాలో........ గణగణ మ్రోగెను ఉయ్యాలో
3. లోకము పరలోకము ఉయ్యాలో........ యేకమై పోయెను ఉయ్యాలో
4. పరలోక దేవుండు ఉయ్యాలో........ ధరణిపై బుట్టెను ఉయ్యాలో
5. మహిమ బాలుండడిగో ఉయ్యాలో........ మరియమ్మ ఒడిలోన ఉయ్యాలో
6. సృష్టికర్త యడిగో ఉయ్యాలో........ శిశువుగా నున్నాడు ఉయ్యాలో
7. పశువుల తొట్టిదిగో ఉయ్యాలో.......పసి పాలకుండడిగో ఉయ్యాలో
8. బాలరాజునకు ఉయ్యాలో....... పాటలు పాడండి ఉయ్యాలో
9. బాలరక్షకునికి ఉయ్యాలో....... స్తోత్రములు చేయండి ఉయ్యాలో
10. పరలోకమంతట ఉయ్యాలో....... పరమ సంతోషమే ఉయ్యాలో
11. నాతండ్రి నాకోసం ఉయ్యాలో....... నరుడుగా బుట్టెను ఉయ్యాలో
12. ముద్దు పెట్టుకొనుడి ఉయ్యాలో........ ముచ్చట తీరంగ ఉయ్యాలో
13. మురియుచు వేయండి ఉయ్యాలో....... ముత్యాల హారములు ఉయ్యాలో
14. గొల్లబోయ లొచ్చి రుయ్యాలో....... గొప్పగ మురిసిరి ఉయ్యాలో
15. తూర్పుజ్ఞాను లొచ్చి రుయ్యాలో....... దోసిలొగ్గి మ్రొక్కి రుయ్యాలో
16. దూతలందరు కూడి రుయ్యాలో....... గీతములు పాడిరి ఉయ్యాలో
17. దేవ స్థానమందు ఉయ్యాలో........ దేవునికి సత్కీర్తి ఉయ్యాలో
18. యేసు బాలుండడిగో ఉయ్యాలో....... ఎంత రమణీయుండు ఉయ్యాలో
19. క్రీస్తు బాలుండిడిగో ఉయ్యాలో....... క్రిస్మసు పండుగ ఉయ్యాలో
20. యేసుక్రీస్తు ప్రభువు ఉయ్యాలో...... ఏక రక్షణకర్త ఉయ్యాలో
21. అర్ధరాత్రి వేళ ఉయ్యాలో........ అంతయు సంభ్రమే ఉయ్యాలో
22. అర్ఢరాత్రి వేళ ఉయ్యాలో........ అంతయు సందడే ఉయ్యాలో
23. మధ్యరాత్రి వేళ ఉయ్యాలో....... మేలైన పాటలు ఉయ్యాలో
24. మేల్కొని పాడండి ఉయ్యాలో....... మంగళ హారతులు ఉయ్యాలో
25. చుక్క ఇంటిపైన ఉయ్యాలో....... చక్కగా నిల్చెను ఉయ్యాలో
26. తండ్రికి స్తోత్రముల్ ఉయ్యాలో........ తనయునికి స్తోత్రములు ఉయ్యాలో