నేడు దేవుడు నిన్ను | Nedu Devudu ninnu chooda vachinaadu | Telugu Christian Song Lyrics | Bible Mission Christmas Song Lyrics | Download
SONG NO.16
నేడు దేవుడు నిన్ను చూడ వచ్చినాడు
నేడు దేవుడు నిన్ను - చూడ వచ్చినాడు - మేలుకో -
నరుడా మేలుకో = ఇదిగో - నేడు రక్షణ తెచ్చినాడు నీ
కోసమై - మేలుకో పాపము చాలుకో
1. దైవ కోపము నుండి - తప్పించు బాలుని - ఎత్తుకో -
నరుడా ఎత్తుకో = తుదకు - నీవు మోక్షము చేరి
నిత్యముండుటకై ఎత్తుకో - బాలుని హత్తుకో || నేడు ||
2. నరకంబు తప్పించు - నరుడౌ దేవపుత్రుని - పుచ్చుకో
నరుడా పుచ్చుకో = మరియు దురితాలన్ గెల్పించు
పరిశుద్ధబాలుని పుచ్చుకో - దేవుని మెచ్చుకో || నేడు ||
3. హృదయమను తొట్టెలో - నే యుండుమని మొర్ర -
బెట్టుకో మొర్ర - బెట్టుకో = మనకు -ముదమిచ్చి బ్రోచెడి
- ముద్దు బాలకుని పట్టుకో - ముద్దు బెట్టుకో || నేడు ||