సంబరాలు మొదలాయే | Sambaralu Modalaye | ఇమ్మానుయేలు దేవుడు | Christmas Song Lyrics | Download
ఇమ్మానుయేలు దేవుడు
ఇమ్మానుయేలు దేవుడు
పరమును వీడి వచ్చాడు
నరునిగా మనకై పుట్టాడు
నిరతము మనతోడుంటాడు..
సంబరాలు మొదలాయే
మన ఊరంతా ఈ రోజుతో..
నింగినేలా ఒకటాయే
మన యేసయ్య రాకతో..
1. లోకమునే ప్రేమించి
తండ్రి చిత్తము చేసి
సింహాసనమే వదిలి దిగి వచ్చాడే!
పాపమునే తొలగించి
శాపమునే విడిపించి
పరిశుద్ధుడిగా ఇలలో జన్మించాడే!
నశియించే వారిని రక్షింపగా వచ్చాడే!
పరలోక మార్గమై లోకాన పుట్టాడే!
దేవాధి దేవుడే మానవుడై వెలిశాడే!..
2. రాజులకు రాజైన
ప్రభువులకు ప్రభువైన
దీనుడిగా భువిపైన ఉదయించాడే
సర్వమునే పాలించే
నరకమునే తప్పించే
దైవకుమారుడిగా మనకై అరుదేంచాడే
మనమంటే ఎంత ప్రేమో మనకై మరణించాడే
మన తండ్రి చెంతకే మననే చేరుస్తాడే
రానున్న రారాజై అతిత్వరలో వస్తాడే..