గగనాన తారక భువనాన | Gaganaana taaraka bhuvanaana | Latest Telugu Christian Christmas Song Lyrics 2024 | Christmas Song Lyrics Telugu | Download
గగనాన తారక భువనాన
గగనాన తారక భువనాన వాలెగా వింతైన వార్త చెప్పగా
భయమేది లేదిక భారం తొలగిందిగా శ్రీ యేసు రాజుపుట్టగా
పరలోక తండ్రి ప్రేమగా తన వారసుణ్ణి పంపగా
భూలోక వాసులందరికి శుభవార్త పండుగా
రారే జనాంగమా కనులారా చుద్దామా
సాంబ్రాణి బోళమర్పించి యేసుని సేవిద్దామా
చరణం 1
పరలోక వాసుడు పరిశుద్ధ దేవుడు
తన స్వాస్థ్యమంత వీడి మన స్నేహాన్ని కోరాడూ..గగనాన
పరలోక పుత్రుడు...పరాక్రమశీలుడు
పశుశాలలో పసిబాలుడై నిశిరాత్రిలో శ్రీయేసుడు ...(2)
అన్ని నామాలకన్నా పైనున్నవాడు
తన రాజ్యస్థాపనకై సామాన్యుడైనాడూ....రారే..
చరణం 2
మనరక్షణార్ధమై...మనుజావతారుడై
మహిమోన్నత స్థలములు వీడి ఈ నేలపై వెలిసాడు ...(2)
రాజాధిరాజు అతడు రాజసం వీడినాడు
మన హృదయ లోగిలిలో చోటుచాలన్నాడు.....రారే