వివాహం అన్నది పవిత్ర మైనది | Vivaham Annadi Pavitramainadi | Telugu Christian Wedding Song Lyrics | Download
వివాహం అన్నది పవిత్ర మైనది
వివాహం అన్నది పవిత్ర మైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది (2)
1. దేహములో సగ భాగముగా -మనుగడలో సహాచారిణిగా (2)
నారిగా సహకరిక స్త్రీని నిర్మించాడు దేవుడు (2) (వివాహం)
2. ఒంటరిగా ఉండరాదని -జంటగా ఉండా మేలని (2)
శిరసుగా నిలవాలని -పురుషుని నియమించినాడు దేవుడు (2) (వివాహం)
3. దేవునికి అతి ప్రియులుగా -ఫలములతో వృద్ధిపొందగా (2)
వేరుగా వున్నా వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు (2) (వివాహం)