సిలువే నా శరణాయెను రా | Siluve Naa Sharanaayenu | Telugu Christian Song Lyrics | Download
సిలువే నా శరణాయెను రా
సిలువే నా శరణాయెను రా
నీ… సిలువే నా శరణాయెను రా
సిలువ యందే ముక్తి బలము చూచితి రా
నీ… సిలువే నా శరణాయెను రా
1. సిలువను వ్రాలి యేసు – పలికిన పలుకులందు
విలువలేని ప్రేమామృతము గ్రోలితి రా
నీ… సిలువే నా శరణాయెను రా
2. సిలువను చూచు కొలది – శిల సమానమైన మనసు
నలిగి కరిగి నీరగుచున్నది రా
నీ… సిలువే నా శరణాయెను రా
3. సిలువను దరచి తరచితి – విలువకందగరాని నీ కృప
కలుషమెల్లను బాపగ చాలును రా
నీ… సిలువే నా శరణాయెను రా
4. పలు విధ పథములరసి – ఫలితమేమి గానలేక
సిలువ యెదుటను నిలచినాడను రా
నీ… సిలువే నా శరణాయెను రా
5. శరణు యేసు శరణు శరణు – శరణు శరణు నా ప్రభువా
దురిత దూరుడ నీ దరి జేరితి రా
నీ… సిలువే నా శరణాయెను రా