భీకరుండౌ మా యెహోవా | Bheekarundau Maa Yehovaa | Telugu Christian Song Lyrics | Download

telugu christian songs,latest telugu christian songs,భీకరుండౌ మా యెహోవా,bheekarundau maa yehovaa,christian songs,new telugu christian songs,telugu christian old songs,bheekarundau ma yehova lyrics,andhra christava keerthanalu telugu songs,christian telugu songs,telugu christian songs tracks,telugu christian songs with lyrics,bheekarundau maa yehova song telugu,bheekarundau maa yehova song lyrics,bheekarundau maa yehova song in telugu,telugu jesus songs

భీకరుండౌ మా యెహోవా

భీకరుండౌ మా యెహోవా – పీఠ మెదుటన్ గూడరే 
ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని గొనియాడరే            ||భీకరుండౌ|| 

మట్టితోనే మమ్ము నెల్ల – మానవులుగ సృజించెను 
ఇట్టి శక్తుండౌ ప్రభున్ మే-మెచ్చుగా మది నెంతుము   || భీకరుండౌ || 

ఏరితోడు లేక మము స-ర్వేశ్వరుడు సృష్టించెను 
ధారుణిన్ దానొక్కడే మా – దైవమని పూజింతుము     || భీకరుండౌ || 

పుట్టగిట్టన్ జేయ దానై – నట్టి దేవుని శక్తిని 
బట్టుగా లోకస్తులారా – ప్రస్తుతింపరే భక్తిని                 || భీకరుండౌ || 

మేటి సంగీతంబులపై – మింట నారవ మొందను 
జాటరే వేవేల నోళ్ళన్ – సన్నుతుల్ ప్రభు వందను       || భీకరుండౌ || 

మిక్కిలి కష్టంబులతో – మిత్తికిని బాల్పొందను 
దిక్కు లేని గొర్రెలట్లు – దిరుగ జేర్పన్ మందను           || భీకరుండౌ ||