దేవుని ఉపకారంబులలోన | Devuni Upakarambulalona | Telugu Chrisitan Song Lyrics | Download Lyrics
దేవుని ఉపకారంబులలోన
దేవుని ఉపకారంబులలోన - దేనిని మరువకుము
ఆయన చేసిన మేలులన్నియు - అనుదినమును ధ్యానించుము
1. నిరాశతో మనమున్నప్పుడు - నిరసించిపడియున్నప్పుడు (2)
మరణ చాయలో నున్నప్పుడు - మరువకుండ కాపాడెనుగా ||దేవుని||
2. వ్యాధులలో మనమున్నప్పుడు - బాధలలో మనమున్నప్పుడు (2)
వ్యాధుల బాధల తొలగించి - ఆదరించి కాపాడెనుగా ||దేవుని||
3. మహోపకారములన్నియును -యెహోవ దేవుడె చేసెనుగా (2)
అహోరాత్రులు ధ్యానించి - మహోన్నతుని స్తుతియించుము ||దేవుని||