దశము భాగము లెల్ల దేవునివి | Dhashamu Bhaagamu Lella Dhaevu | Telugu Christian Song Lyrics Download
దశము భాగము లెల్ల దేవునివి
దశము భాగము లెల్ల దేవునివి ధారాళముగ నియ్య సమకూడుడి
పశువులు పైరులు దేవునివి పసిడి లోహపుగనులు దేవునివి
భాగ్యభోగ్యము లెల్ల దేవునివి భావించి కానుకలను నియ్యుడి ||దశమ||
దేవునివి దొంగలించెదరా దేవదేవుని మోసపుచ్చెదరా
భావించి మది నెంచి భయము నెంచి ప్రార్ధింప దలవంచి ప్రభు భాగమున్
దేవాలయంబును పూర్ణంబుగా దేదీప్యముగా నుండ సమకూర్చుడీ ||దశమ||
పరిశుద్ధ దేవుని మందిరము పరిపూర్ణముగాను యోచించుడీ
పరిశుద్ధ భాగము విడదీయుడీ పాడిపంటలు నాస్తి దేవునివి పదియవ భాగంబు దేవునివి
పరమాత్మ దీవెనలను బొందుడీ ||దశమ||
ప్రథమ ఫలంబులు దేవునివి విదితంబుగా నీయ మది నెంచుడీ
సదమల హృదయములను బొందియు ప్రథమ భాగము నెల్ల విడదీసియు
ముదమున దేవునికర్పించుడీ సదయు దీవెనలొంద సమకూర్చుడీ ||దశమ||
ఆకసపు వాకిండ్ల విప్పుదును అధిక కృపలను గుమ్మరించుదును
మీ కష్టఫలములను దీవింతును భీకర నాశంబు దొలగింతును
మీ కానంద దేశ మిత్తు నని శ్రీకరుం డెహోవా సెల విచ్చెను ||దశమ||
దినభోజనం బిచ్చు దేవునిని ఘన సౌఖ్యముల నిచ్చు దేవునిని
వినయంబుతో మదిని ధ్యానించుచు దినభోజనంబులను భాగించుచు మానక దేవుని కర్పించుడీ
ఘనసేవ జయమొందు పని బూనడీ ||దశమ||