నా ఆశలన్నీ తీర్చువాడా | Naa Ashalanni tircuvada | Latest Telugu Christian Song Lyrics | Download
నా ఆశలన్నీ తీర్చువాడా
నా ఆశలన్నీ తీర్చువాడా
నిన్నే నే నమ్మితినయ్య
నాకున్న ఆధారం నీవెనయ్య
నా క్షేమమంతయు నీలోనయ్య
ఏదైన నీ వల్లె జరుగునయ్య ||నా ఆశలన్నీ||
1. ఊహించలేదు నేనెప్పుడు
నేనంటే నీకు ఇంత ప్రేమనీ (2)
పగిలిపోయిన నా హృదయమును (2)
నీ గాయాల చేతితో బాగుచేసావే (2) ||నా ఆశలన్నీ||
2. ఇక ఈ బ్రతుకు ఐపోయిందని
నిర్థారించిన వారు ఎందరో (2)
విసిగిపోయిన నా ప్రాణమును (2)
ప్రతి రోజు క్రొత్తగా బ్రతికించుచున్నావే (2) ||నా ఆశలన్నీ||
3. ఆశించితి నేను నీ చెలిమిని
కడవరకు నీతోనే బ్రతకాలని (2)
మిగిలిపోయిన ఈ అధముడను (2)
నీ సేవచేసే భాగ్యమిచ్చావే (2) ||నా ఆశలన్నీ||