స్తోత్రార్పణ నర్పింతము జప | Sthoathraarpana Narpimthamu | Andhra Kristhava Keerthanalu Song Lyrics | Download
స్తోత్రార్పణ నర్పింతము జప
స్తోత్రార్పణ నర్పింతము జప ధూపము వేసి కీర్తింతము పాత్రుం డైన
శ్రీ యేసుఁడు పరమ భోజనాంశమైనందున ||స్తోత్రార్పణ||
1. కృతజ్ఞతా స్తోత్రంబులన్ దేవ కృపార్థంబై చేయుదము క్షీతి నాతండు
బలి నియ్యగా పుట్టె నూతనంపు నిబంధన ||స్తోత్రార్పణ||
2. పాపము లన్ని హరించెను మా ప్రభు వగు యేసు సురక్తము ఏపుగ
దీని దలంచుచు నిక నెన్నడు యేసుని భజింతము ||స్తోత్రా||
3. చావు నుండి రక్షించెను స జీవులలో లెక్కించెను దేవుని కిక
నర్పింతము స జీవార్పణ బలిగను ||స్తోత్రా||
4. పుణ్యరక్త శరీరముల లో పాలొందు మన మందరము అన్యులము
కానేరము దై వాన్యోన్యంబు నొందినాము ||స్తోత్రా||
5. మరణ శ్రమల స్మరింతము ప్రభు తిరిగి వచ్చు పర్యంతము ధర నా
యేసు మరణంబును యింక చిరకాలంబు జాటింతము ||స్తోత్రా||