దున్నని బీడు భూములలో | Dunnani Beedu Bhoomulalo | Telugu Christian Youtube Song Lyrics | BRO SUNNY RAJ KODAVATI

rraj prakash paul songs,jessy paul songs,prabhu pammi,samuel karmoji songs,enosh kumar songs,john wesly messages,hosanna songs,p sathish kumar,calvary temple songs,calvary temple,the lords church,sunny raj kodavati,telugu christian songs,telugu christian messages,telugu christmas songs,telugu worship songs,hindi christian songs,hosanna messages,yesanna messages,bhakth singh,hebron,andhra kraisthava keerthanalu,inspirational messages,viral,satisfying

నడిపించు నా దేవా

    
నడిపించు నా దేవా - జరిగించు నీ సేవ 
    చూపించు ఓ త్రోవ - పయనానికి ఓ ప్రభువా (2) 
    దున్నని బీడు భూములలో - ఎవ్వరూ పోని స్థలములలో 
    రక్షణ లేని మనుష్యులలో - మారుమూల పల్లెలలో (2) 

1. ఎవరో వేసిన పంటను కోసే - పరిచర్య వద్దయ్యా 
    నీ పిలుపును విని పరుగున వచ్చే - ఆత్మలను ఇవ్వయ్య (2) 
    పరులకు చెందే స్వాస్థ్యము తినే - పురుగుగా వద్దయ్యా 
    నశించు దానిని వెదకి రక్షించే - భారమును ఇవ్వయ్యా  (2) ||దున్నని|| 

2. ఎదిగే క్రమములో పిలుపును మరిచే - గుణమే వద్దయ్యా 
    ఎవరిని తక్కువ చేయని మనసే నాలో నింపయ్యా (2) 
    కష్టము లేక సుఖముగా వచ్చే -  ఫలమే వద్దయ్యా 
    కన్నీటితో విత్తి ఆనందంతో కోసే - పంటను ఇవ్వయ్యా  (2) ||దున్నని|| 

3. ఇతరుల ఆస్తిపై కన్ను వేసే - దొంగను కానయ్యా 
    స్థిరపడి యున్న సంఘాలను నే కూల్చను యేసయ్యా  (2) 
    నాకు చాలిన దేవుడవు నీవే యేసయ్యా 
    మరణించగానే నిన్ను చేరే భగ్యమునిమ్మయ్యా  (2) ||దున్నని||