ఎన్ని తలచినా ఏది అడిగినా | Enni Thalachinaa Edi Adiginaa | Andhra Kristhava Keerthanalu Song Lyrics | Jesus Songs Telugu Lyrics | Download

bekind,christian songs,christian songs 2023,christian music,gospel music,worship,non stop christian songs,new christian,jesus,christian song,jesus songs,god songs,jesus music,christian,jesus telugu songs,latest telugu christian songs,jesus songs in telugu,telugu christian songs,new songs,christmas songs,popular christian songs,top christian songs,best christian songs,hosanna ministries,ఎన్ని తలచినా ఏది అడిగినా,Enni Thalachinaa Edi Adiginaa

ఎన్ని తలచినా ఏది అడిగినా

ఎన్ని తలచినా ఏది అడిగినా 

జరిగేది నీ చిత్తమే (2) ప్రభువా 

నీ వాక్కుకై వేచియుంటిని 

నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా 


నీ తోడు లేక నీ ప్రేమ లేక 

ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు (2) 

అడవి పూవులే నీ ప్రేమ పొందగా (2) 

నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా      ||ఎన్ని|| 


నా ఇంటి దీపం నీవే అని తెలసి 

నా హృదయం నీ కొరకై పదిలపరచితి (2) 

ఆరిపోయిన నా వెలుగు దీపము (2) 

వెలిగించుము నీ ప్రేమతో (2) ప్రభువా      ||ఎన్ని|| 


ఆపదలు నన్ను వెన్నంటియున్నా 

నా కాపరి నీవై నన్నాదుకొంటివి (2) 

లోకమంతయూ నన్ను విడచినా (2) 

నీ నుండి వేరు చెయ్యవు (2) ప్రభువా      ||ఎన్ని|| 


నా స్థితి గమనించి నన్నూ ప్రేమించి 

నా కొరకై కల్వరిలో యాగమైతివి (2) 

నీదు యాగమే నా మోక్ష మార్గము (2) 

నీయందే నిత్యజీవము (2) ప్రభువా         ||ఎన్ని||