ఓ యేసు భక్తులారా | Oh Yesu bhakhtulaaraa | Telugu Andhra Kristhava Keerthanalu Song Lyrics | Jesus Song Lyrics Telugu | Download
ఓ యేసు భక్తులారా
1. ఓ యేసు భక్తులారా - మీ రాజు ధ్వజము
గ్రహించి సాహసించి పోరాడి గెల్వుడీ
విశ్వాసులారా, రండి - మీ రక్షణార్థమై
ప్రయాసపడ్డ యేసు - విజయమిచ్చును
2. మీ యందసూయబట్టి - మీ ఆత్మ నాశనము
నెల్లప్పుడు గోరునట్టి యనేకులుందురు
మీ రెల్ల రేసు పేరు - వచించి యాయనే
సర్వాధికారి యంచు - సేవింపవలెను
3. ప్రచండమైన దండు - పోరాడ లేచినన్
విరోధి శక్తికొద్ది మరీ తెగించుడీ
స్వకీయ శక్తిగాక - శ్రీ యేసు నామమున్
స్మరించి వానియందు - విశ్వాస ముంచుడి