సర్వేశా రమ్ము నీ సన్నిధి | Sarvesa Rammu Nee Sannidhi | Andhra Kristhava Keerthanalu | Song Lyrics Telugu | Download
సర్వేశా! రమ్ము నీ సన్నిధి
సర్వేశా! రమ్ము నీ సన్నిధి కాంతి
నొసంగు మాకు సత్య సనాతన
సర్వాధికారుడా సదా మమ్మేలుము
సర్వోన్నతా!
నిత్యంపు వాక్యమా! నీదగు ఖడ్గము
నిమ్ము మాకు నీ నిజ భక్తులన్
నీ వాక్య ప్రియులన్
నింపు నీ యాత్మతో నింపు మీర || సర్వేశా! ||
రమ్ము మహాత్మ! మా
కిమ్ము నీ యాత్మను రమ్ము వేగ
రక్తితో నిప్పుడు రమ్ము మా మధ్యకు
రక్షించు మమ్మును రంజిల్లగన్ || సర్వేశా! ||
స్తోత్రం పవిత్రుఁడా!
స్తోత్రంబు త్ర్యేకుండా! స్తోత్రం సదా
ధాత్రి నీమహిమ నేత్రంబులు గను
మీ, “త్రాహిమాం” యని వేడు వారి || సర్వేశా! ||