అనాది పురుషుండైన దేవుని | Anaadi Purushundaina Devuni | Bible Song Lyrics Telugu | Telugu Christian Song Lyrics | Download
అనాది పురుషుండైన దేవుని
SONG NO. 02
అనాది పురుషుండైన దేవుని - ఆరాధించండి =
అనాది దేవుండే అనంత దేవుడై యుండె = అనాదిని
1. ఒక్కండే దేవుండు - ఒంటరిగానే యుండె - అనాదిని =
ఎక్కువ మందియైన - ఎవరిని గొల్వవలెనో తెలియదు - ఆందోళం ||అనాది||
2. పాపంబు నరులకు - పరమాత్ముని మరుగు చేసెను -
అయ్యయ్యో పాపు లందుచేత - పలువిధ దేవుండ్లను కల్పించిరి - విచారం ||అనాది||
3. గనుక సర్వంబునకు - కర్తయైన ఏకదేవున్ - కనుగొనుడి =
కనుగొని మ్రొక్కండి - అని బోధించుచున్నాము - శుభవార్త ||అనాది||
4. ఆకాశము భూమియు - లేక ముందే కాలము - దూతలు =
లేకముందే దేవుడు - ఏక దేవుండై యుండె - గంభీరం! ||అనాది||