దేవా తండ్రీ నీకు | Devaa Tandri Neeku | Bible Mission Christian Song Lyrics Telugu | Download
దేవా తండ్రీ నీకు
SONG NO. 03
దేవా తండ్రీ నీకు - దిన దిన స్తుతులు = నావిన్నపము విన్న నాధా సంస్తుతులు
1. అపవిత్రాత్మల దర్శన - మాపియున్నావు = ఎపుడైన అవి నా - కేసి రానీయవు|| దేవా ||
2. చెడ్డ ఆత్మల మాటల్ - చెవిని బడనీయవు = గడ్డు పలుకుల నోళ్ళు - గట్టియున్నావు|| దేవా ||
3. చెడు తలంపులు పుట్టిం - చెడి దుష్టాత్మలను నా = కడకు రానీయవు - కదల నీయవు|| దేవా ||
4. పాపంబులను దూర - పరచి యున్నావు = పాపంబులను గెల్చు - బలమిచ్చినావు|| దేవా ||
5. పాప ఫలితము లెల్ల - పారదోలితివి = శాప సాధనములు - ఆపివేసితివి || దేవా ||
6. దురిత నైజపు వేరు - పెరికి యున్నావు = పరిశుద్ధ నైజ సం - పద యిచ్చినావు|| దేవా ||
7. ప్రతి వ్యాధినిన్ స్వస్థ - పరచి యున్నావు = మతికి ఆత్మకును నె - మ్మది యిచ్చినావు|| దేవా ||
8. అన్న వస్త్రాదుల - కాధార మీవె = అన్ని చిక్కులలో స - హాయుండ వీవే|| దేవా ||
9. ననుగావ గల దూత - లను నుంచినావు = నిను నమ్ము విశ్వాస - మును నిచ్చినావు|| దేవా ||
10. సైతాను క్రియలకు - సర్వ నాశనము = నీ తలంపులకెల్ల - నెరవేర్పు నిజము|| దేవా ||
11. సాతాను ఆటలిక - సాగనియ్యవు = పాతాళాగ్ని కతని పంపి వేసెదవు|| దేవా ||
12. అన్ని ప్రార్థనలు నీ - వాలించి యున్నావు - అన్నిటిలో మహిమ అందుకొన్నావు|| దేవా ||
13. సర్వంబులో నీవు - సర్వమై యున్నావు = నిర్వహించితివి నా - నిఖిల కార్యములు|| దేవా ||
14. హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ తండ్రీ = కలకాల మున్నట్టి హల్లెలూయ తండ్రీ!|| దేవా ||
15. జనక కుమారాత్మ - లను త్రైకుడొందు = ఘనత కీర్తి మహిమ చనువు నాయందు|| దేవా ||