దేవ దేవ దేవ దివి నున్న దేవా | Deva Deva Deva Divi Nunna Devaa | Christmas Song Lyrics Telugu | Bible Mission Song Lyrics | Download
SONG NO. 19
దేవ దేవ దేవ దివి నున్న దేవా
దేవ దేవ దేవ - దివి నున్న దేవా! - పావన స్తోత్రముల్
- పరలోక దేవా దేవ
1. అన్ని లోకములకు - అవతలనున్న = ఉన్నత లోకాన
సన్నుతులుగొన్న దేవ || దేవ ||
2. మహిమ లోకంబున - మహిమ పూర్ణముగ =
మహనీయముగ నుండు - మానకుండగను దేవ || దేవ ||
3. నీ కిష్టులైనట్టి - లోకవాసులకు = రాకమానదు శాంతి
రంజిల్లు వరకు దేవ || దేవ ||
4. ధరణి మీదను - సమాధానంబు కలుగు = నరులకు
నీదర్శనం బిచట కలుగు దేవ || దేవ ||
5. వధువు సంఘమునకు బాలుండు పుట్టు = వృధిని
సువార్తకు పెరుగుట పట్టు దేవ || దేవ ||
6. ప్రసవవేదన పొంది - వధువు సభ అరసె = అసలైన
మగబిడ్డ అదునుకు వెలసె దేవ || దేవ ||