దేవ స్తోత్రగానముల్ పై దివ్య స్థలములో | Deva Stotraganamulu Pai Divya Sthalamulo | Telugu Christian Song Lyrics | Bible Mission Christmas Song Lyrics | Download

Deva Stotraganamulu Pai Divya Sthalamulo lyrics, Telugu Christian song lyrics, Christian worship songs Telugu, Telugu praise songs, Jesus songs in Telugu, Telugu devotional songs, Christian gospel songs Telugu, Telugu church songs, Telugu spiritual songs lyrics, Deva Stotraganamulu Telugu lyrics, Telugu faith songs, Bible Mission Telugu songs

SONG NO. 20

దేవ స్తోత్రగానముల్ పై దివ్య స్థలములో

దేవ స్తోత్రగానముల్ పై - దివ్య స్థలములో - దేవమారు 
గానముల్ భూ - దేశ స్థలములో = దేవలోక 
పావనులును - దీన నరులును బోవ జూడ - భువి దివి క్రిస్మస్ || దేవ ||

1. అవ్వకిచ్చినట్టి వాక్కు - అదిగో తొట్టిలో - పవ్వళించి 
    యున్న దేవ బాల యేసులో = ఇవ్విధముగ  
    ఫలమాయే - ఈదినంబున నవ్వుమోము - నరుని కబ్బెను || దేవ ||

2. షేము దేవ వందనంబు - చెప్పబడియెను భూమి 
    స్తుతుల నందు కొనెడి - పూజనీయుడు = భూమిపైన 
    నరుడుగాను - బుట్టవచ్చెను భూమి క్రిస్మస్ - భోగమొందెను || దేవ ||

3. అందరి వంశంబులు నీ - యందు దీవెన - బొందునంచు 
    నబ్రామునకు నందెనువాక్కు = అందె క్రీస్తు 
    యూదులకును అన్యజనులకున్ విందు క్రిస్మస్ - విశ్వమంతటన్ || దేవ ||

4. షీలో వచ్చువరకు యూ - దాలో నిలుచుచు - 
    నేలురాజు దండ ముండు నెపుడు తొలగదు = 
    నేలమీద నిత్యశాంతి పాలనజేయ - పాలకుండౌ - బాలుడు జన్మించెన్ || దేవ ||

5. అక్షయమగు చుక్క యొకటి - యాకోబులో - 
    లక్షణముగ బుట్ట వలయు - ను ధాత్రి పై = రక్షణార్ధులే 
    సదా ని - రీక్షించెడు నక్షత్రంబగు రక్షకుడుదయించె || దేవ ||

6. పుట్టవలయు మోషేవంటి - పూర్ణ ప్రవక్త - ఎట్టివారలైన 
    నెరుగ - నట్టి ధర్మముల్ - దిట్టముగను స్థాపింప - దేవ 
    పుత్రుడు - పుట్టెన్ గొప్ప - బోధకుడాయెను || దేవ ||

7. మరియ పుత్ర నామ - మిమ్మానుయేలగున్ - నరులకు 
    దేవుండె తోడు - నిరతము వరకున్ - దరిని 
    దేవుడుండు గాన - వెరవమెన్నడున్ - పరమ దేవుని 
    సహ - వాసము లభించున్ || దేవ ||

8. మన నిమిత్తమైన శిశువు - మహిని బుట్టెను - చనువుగ 
    దరిజేర శిశువు - స్వామియాయెను = తనువు రక్షణను 
    గణింప - వెనుకదీయదు వినయ భూషణులకు - వేళవచ్చెను || దేవ ||

9. మొలకలెత్తవలె యెష్షయి - మొద్దునందున - ఫలము 
    లేని మోడు నరుల - వంశ వృక్షము = విలువగలుగు 
    నిత్యజీవ - ఫలములిడుటకై కళగల జన్మార్ధ - కరుడు వచ్చెను || దేవ ||

10. ఖలులు చీకటిన్ నడుచుచు - వెలుగుచూచిరి - పలు 
    విధంబులైన యట్టి - పాప చీకటుల్ = తొలగ జేసి 
    శుద్ధకాంతి - కలుగ జేయను - వెలుగుగా దేవుడు - వెలసె ధాత్రిలో || దేవ ||

11. అల్పమైన బెత్లెహేము - నందున క్రీస్తు - నిల్పవలెను 
    తనదు జన్మ - నిజ చరిత్రను = అల్పులందు సైతమల్ప 
    - మైన యూళ్ళలో - స్వల్ప రక్ష - స్థాపకుడై వచ్చె || దేవ ||

12. ఆడి తప్పనట్టి దేవ - అనంత స్తోత్రముల్ - నాడు 
    పల్కు వాగ్ధా - నముల నన్నిటిన్ = నేడు నెరవేర్చినావు 
    - నీ సుతునంపి - కీడుల్ బాపు - క్రిస్మసుగల్గె || దేవ ||

13. నీ నిజ వాగ్ధత్తములను - నిత్యము నమ్మి - వాని 
    నెరవేర్పులు విని - వట్టివి యనక = మానసమున 
    ననుభవించు - మనసు - నీయుమ నీ - దానామూల్య - జ్ఞాన మొసగుమీ || దేవ ||

14. గగనమందు క్రిస్మసుండు - గాన కీర్తులౌ - జగతియందు 
    క్రిస్మసుండు స్థవము గల్గుత = యుగ యుగముల 
    వరకు త్రైకు - డొందు ప్రణుతులు సొగసుగ బరిగెడు - చోద్య గీతముల్ || దేవ ||