జగమంతా దివ్య కాంతితో | Jagamantha divya kaantitho | Telugu Christmas Song Lyrics 2024 | Jesus Christmas Song Lyrics | Download

Jagamantha Divya Kaantitho Lyrics, Telugu Christmas Songs 2024, Jesus Christmas Songs in Telugu, Jagamantha Divya Kaantitho Christmas Song, Telugu Christian Songs Lyrics Download, Telugu Christmas Song Lyrics 2024, Christian Songs in Telugu, Jagamantha Divya Kaantitho Song Download, Telugu Christmas Song Lyrics for Kids, Telugu Jesus Christmas Song Lyrics, Christmas Worship Songs Telugu, Latest Telugu Christmas Songs 2024, Free Telugu Christmas Lyrics Download, Christmas Praise Songs in Telugu, Christmas Devotional Songs Telugu

జగమంతా దివ్య కాంతితో

జగమంతా దివ్య కాంతితో - ప్రకాశించే క్రీస్తు జన్మతో ||2||

దేవుడే మానవుడై మన మధ్య నివశింప - ప్రేమానురాగాలు పంచగ ఇలలో

పాపులను రక్షింప ప్రాణమునే అర్పింప - పావనుడే ఈ భువికి వచ్చు వేళలో ||2||

చరణం 1:

చీకటి నిండిన పాపము పండిన - లోకమునెంతో ప్రేమించెను

త్రోవ తప్పిన దేవుని విడిచిన - పాపిని ఎంతో క్షమించెను ||2||

లోక పాపములు మోయు గొర్రెపిల్లగా క్రీస్తు - శిలువలో మరణించి పాపమునే తొలగించే

లోకమును వెలిగింప క్రోవుత్తుల కరిగే - బ్రతుకు చీకటిని పారద్రోలేను

వేవేల కాంతులతో నిండెను బ్రతుకంతా

శ్రీ యేసు జన్మించగా - ఈ లోకానికే పండుగా

చరణం: 2

ఆజ్ఞతిక్రమమే పాపమాయెను - నిత్య మరణానికి దారితీసేను

దేవుని కృపలో క్రీస్తునందు- నిత్య జీవం అనుగ్రగించెను ||2||

నశించినవారిని వెదకి రక్షించుటకు - అరుణోదయ తారయై ఉదయించెను

విశ్వసించు ప్రతివాడు నిత్యజీవమును పొంద - జీవహారమై దిగివచ్చెను

మరణపు ముళ్ళు విరిచేను పరలోకం చేర్చెను

శ్రీ యేసు దారికి చేరగా - విశ్వాసముంచి నీవు కొలువగా