బేత్లహేములోన పశువుల | Bethlehemulo Na Pashuvula | Telugu Christmas Song Lyrics | Jesus Christmas Song Lyrics | Download
బేత్లహేములోన పశువుల
బేత్లహేములోన పశువుల పాకలో యేసయ్యా పుట్టిన్నాడు
మన యేసయ్యా పుట్టిన్నాడు
సర్వలోకానికే నీవు వెలుగువయ్యా యేసయ్యా
నీకు స్తోత్రములయ్యా
"" పుట్టినాడు రక్షకుడు వచ్చినాడు మన యేసుండు ""
1. గొర్రెల కాపరులు పాలములో
తమ మందను కాస్తూ ఉండగా (2)
ప్రభువు దూత వారి యొద్ద నిలిచి
దావీదు పట్టణము నందు మీకు రక్షకుడు పుట్టియునడని
|| బేత్లహేములోన ||
2. ఇమ్మానియేలు దేవుడు
మన ఆత్మలకు రక్షణ క్రీస్తు (2)
ఆదాము నుండి మృతిబొందిన వారినే (2)
బ్రతికించుటకు వచ్చిన ఈ యేసు
పశు తొట్టిలోన పరుండెను
|| బేత్లహేములోన ||
3. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
బలవంతుడైన దేవుడు (2)
నిత్యుడగు తండ్రి
సమాధానకర్త అధిపతి (2)
|| బేత్లహేములోన ||