కనుపాప వలే నను కాయుటకే | Kanupapa vale nanu kaayutake | Christian Song Lyrics Telugu | New Year Song Lyrics Telugu | Download
కనుపాప వలే నను కాయుటకే
కునుకవు నీవు నా కన్న తండ్రీ
శూరులే కూలే శోధన కాలమున
కాపాడెదవూ నా యేసయ్యా
1.నీ తల వెంట్రుకలు లెక్కించితినీ
నా సెలవు లేక ఒక్కటీ రాలదనీ
నిను తాకుట నా కను పొడుచుటయే
భయపడవద్దనీ వాగ్ధాన మిచ్చితివే ॥కనుపాప॥
2.జల ప్రళయములో పెను తుఫానులలో
ఒంటరి సమయంలో మించిన పోరులలో
నీ ప్రియ దాసుల శుద్ధిని, భక్తిని
కాపాడిన రీతి నను కావుమయ్యా
॥కనుపాప॥
3.దారుణ దాస్యములో శత్రువు ముట్టడిలో
అగ్ని కీలలలో సింహపు కోరలలో
నీ పిల్లలగు మా పితరులనూ
కాపాడిన రీతి మము కావుమయ్యా ॥కనుపాప॥