దైవాత్మా రమ్ము | Daivatma Rammu | Bible Mission Songs Lyrics | Telugu Christian Song Lyrics Download
SONG NO. 09
దైవాత్మా రమ్ము
దైవాత్మా రమ్ము - నా తనువున వ్రాలుము - నా =
జీవమంతయు నీతో నిండ - జేరి వసింపుము || దైవాత్మా ||
1. స్వంత బుద్ధితోను - యేసు - ప్రభుని నెఱుగలేను - నే = నెం
తగ నాలోచించిన విభుని - నెఱిగి చూడ లేను || దైవాత్మా ||
2. స్వంత శక్తితోను - యేసు - స్వామి జేరలేను - నే =
నెంత నడచిన ప్రభుని కలిసికొని - చెంత జేరలేను || దైవాత్మా ||
3. పాప స్థలము నుండి - నీ సు - వార్త కడకు నన్ను - భువి
నో = పరమాత్మ! నడుపు చుండుము - ఉత్తమ స్థలమునకు || దైవాత్మా ||
4. పాపములో మరల - నన్ను పడకుండగ జేసి - ఆ నీ =
పరిశుద్ధమైన రెక్కల - నీడను కాపాడు || దైవాత్మా ||
5. పరిశుద్ధుని జేసి - నీ - వరములు దయచేసి - నీ =
పరిశుద్ధ సన్నిధిని జూపుమా - పావురమా! వినుమా || దైవాత్మా ||
6. తెలివిని గలిగించు - నన్ను - దివ్వెగ వెలిగించు - నీ =
కలిగిన భాగ్యములన్నిటిని నా - కంటికి జూపించు || దైవాత్మా ||
7. నన్నును భక్తులను - యే - నాడును కృపతోను - నిల =
మన్నించుము మా పాప రాసులను - మాపివేయు దేవా || దైవాత్మా ||
8. వందనములు నీకు - శుభ - వందనములు నీకు - ఆ =
నందముతో కూడిన నా హృదయ వందనములు నీకు || దైవాత్మా ||