దేవ యెహోవా స్తుతి పాత్రుండ | Deva Yehovah Stuti Pathrundu | Bible Mission Song Lyrics Telugu | Christian Song Lyrics Telugu | Download
SONG NO. 08
దేవ యెహోవా స్తుతి పాత్రుండ
దేవ యెహోవా! స్తుతి పాత్రుండ! - పరిశుద్ధాలయ
పరమ నివాసా! || దేవ ||
1. బలమును కీర్తియు శక్తి ప్రసిద్ధత - సర్వము నీవే =
సకల ప్రాణులు స్తుతి చెల్లించగ - సర్వద నిను స్తుతు -
లొనరించగనున్న || దేవ ||
2. నీదు పరాక్రమ కార్యములన్నియు - నిరతము నీవే =
నీదు ప్రభావ మహాత్యము లన్నియు - నిత్యము
పొగడగ నిరతము స్తోత్రములే || దేవ ||
3. స్వర మండల సితారలతోను - బూరల ధ్వనితో =
తంబురలతో నాట్యము లాడుచు - నిను
స్తుతియించుచు - స్తోత్రము జేసెదము || దేవ ||
4. తంతి వాద్య పిల్లన గ్రోవి - మ్రోగెడు తాళము = గంభీర
ధ్వని గల తాళములతో - ఘనుడగు దేవుని కీర్తించను
రారే || దేవ ||
5. పరమాకాశపు దూతల సేనలు - పొగడగ మీరు =
ప్రేమమయుని స్తోత్రము చేయగ - పరమానందుని -
వేగస్మరించను రారే || దేవ ||
6. సూర్య చంద్ర నక్షత్రంబు - గోళములారా! =
పర్వతమున్నగు వృక్షములారా! - పశువులారా! -
ప్రణుతించను రారే || దేవ ||
7. అగ్నియు మంచును సముద్ర ద్వీప - కల్పము లారా =
హిమమా వాయువు తుఫానులారా! - మేఘములారా!
మహిమ పరచ రారే || దేవ ||
8. సకల జల చర సర్వ - సమూహములారా! = ఓ
ప్రజలారా! భూపతులారా! - మహనీయుండగు -
దేవుని స్తుతి చేయన్ || దేవ ||