విజయ సంస్తుతులే నీకు | Vijaya Samstutule Neeku | Telugu Christian Song Lyrics | Bible Mission Song Lyrics | Download
SONG NO. 11
విజయ సంస్తుతులే నీకు
విజయ సంస్తుతులే నీకు - ప్రేమ స్వరూపా! - విజయ
సంస్తుతులు నీకు = జయమే లభించు నీకు -
విశ్వమంతట సర్వ దీక్ష - ప్రజల వలన నిత్యమైన -
ప్రణుతులు సిద్ధించు నీకు || విజయ ||
1. నేడు మా పనులెల్లను - దీవించుము - నిండుగా
వర్ధిల్లును = చూడవచ్చిన వారికిని బహు -
శుభకరముగా నుండునటుల - కీడు బాపుచు మేళ్ళను
సమ - కూడ జేసిన నీకే కీర్తి || విజయ ||
2. ఆటలాడుకున్నను నీ నామమున - పాటల్
పాడుకున్నను = నాటకంబుల్ కట్టుకున్నను -
నాట్యమాడుచు మురియుచున్నను - కూటములను
జరుపుకున్నను - నీటుగను నీ కేను కీర్తి || విజయ ||
3. పరలోకమున కీర్తి - దేవా! నీకే ధరణియందున కీర్తి =
నరుల హృదయములందు కీర్తి - పరమ దూతలందు
కీర్తి - జరుగు కార్యములందు కీర్తి - జరుగని పనులందు కీర్తి
|| విజయ ||