పరికించుము నాజీవితము | Parikinchumu Naa Jeevithamu | Latest Telugu Christian Song Lyrics | Symphony Music Lyrics Telugu | Download
పరికించుము నాజీవితము
పరికించుము నాజీవితము
పనికిరానివి తొలగించుము
కనిపించునట‌్లు నాలోఫలము
పంపించుముఆశీర‌్వాదము
1. నీలో నిలిచి నీతో నడిచి నిను హత‌్తుకొని ఉండనీయుము (2)
కాలువయోరన నాటిన చెట‌్టులా (2)
పచ‌్చగాఎదిగేకృపనీయుము (2)
|| పరికించుము ||
2. నీపై ఒరిగి నీకై కరిగి నీను అల‌్లుకొని ఉండనీయుము (2)
వాక‌్యపుసారము పొందిన కొమ‌్మలా (2)
సాక్షిగా నిలిచే కృపనీయుము (2)
|| పరికించుము ||
3. నీకే వెరచి నీచే వెలిగి నిను అంటుకొని ఉండనీయుము (2)
జీవితపు కాంతిలో ప‌్రాకినతీగలా (2)
దీవెనకలిగే కృపనీయుము (2)
|| పరికించుము ||