ఉదయించినాడు నా జీవితాన | Udayincinadu na jivitana | Telugu Christian Song Lyrics
ఉదయించినాడు నా జీవితాన
ఉదయించినాడు నా జీవితాన
నా నీతి సూర్యుడు నా యేసయ్యా ( 2 )
అ.ప .: సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ ( 2 )
ఇష్టులైన వారికి యిల సమాధానము ( 2 )
1. మతిలేని నా జీవితాన్ని
మరువలేదు నా మెస్సయ్యా (2)
మరియమ్మ గర్భాన జన్మించినాడు
మార్చెను నా బ్రతుకును నా యేసయ్యా (2) (ఉద)
2. కష్టాల కడగండ్లలోన కన్నీరు నే కార్చగా (2)
కడతేర్చుటకై కరుణామయునిగా
కాంక్షతో ప్రభువు యిలతెంచెను ( 2 ) (ఉద)
3. గురిలేని ఈ యాత్రలోన ...
గుర్తించి నన్ను పిలిచెను ( 2 )
గుణవంతుడైన నా యేసయ్యనే
గురిగా నేను తెలుసుకొంటిని ( 2 ) (ఉద)