Yekaantha Sthalamu | ఏకాంతస్థలము కోరుము | Telugu Christian Song Lyrics
ఏకాంతస్థలము కోరుము | Yekaantha Sthalamu | Bible Mission Song Lyrics | Telugu Christian Song Lyrics | Download Song Lyrics ఏకాంతస్థలము కోరుము ఏకాంతస్థలము కోరుము – దేవుని ప్రార్ధింప – ఏకాంత స్థలము చేరుము ఏకాంత స్థలము చేరి – మోకాళ్ళ మీదవుండి లోకాశలను మదికి రాకుండ చూచుకొనుము || ఏకాంత || ఊహలోని పాపములను - ఒప్పుకొనుము తండ్రి యెదుట దేహము లోకలకవియె - దిగును నిన్ను బాధ పెట్టును || ఏకాంత || మాటలందలి పాపములను - మన్నించుమని వేడుకొనుము ఆటపాటలందు మాట - లాడుటయు నేరంబులగును || ఏకాంత || పాపక్రియలు అతి దుఃఖముతో - ప్రభుని యెదుట ఒప్పుకొనుము పాపము మరల చేయనట్టి - ప్రయత్నంబుల్ చేయవలెను || ఏకాంత || నిన్ను మరల సిలువవేసి - యున్న పాప జీవినయ్యో నన్ను క్షమియించుమని యన్న - నరులు మారువారు || ఏకాంత || చెడుగుమాని మంచి పనులు - చేయకున్న పాపమగును పడియు లేవకున్న గొప్ప - పాపమగును పాపమగును || ఏకాంత || దేవా! నాకు కనబడుమన్న - దేవ దర్శనమగును నీకు పావనంబగు రూపము చూచి - బహుగా సంతోషించగలవు || ఏకాంత || దేవా! మాటలాడుమన్న - దేవ వాక్కు వినబడు నీకు నీవు అడిగిన ప్రశ్నలకెల్ల - నిజము తెలియనగును నీకు || ఏకాంత || ఎ...