Chooda Goreda | చూడ గోరెద | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.19 - దేవుని మందిరావరణములు చూడ గోరెద -నీ-మంది రావరణములను చూడగోరెద = చూడ నాకు నాశ గలదు - సుందరావరణము లవి = చూడ నాదు ప్రాణమెంతో- సొమ్మసిల్లుచున్నదహా ॥ జూడ ॥ 1. నీదు నీవాసములు జూడ - నెంతో రమ్యమైతనర =నాదు హృదయము నకు నా-నంద మిచ్చు నిపుడు నెపుడు ॥ జూడ ॥ 2. జీవము గల ప్రభుని చూడ- జీవి నాలో కేక వేసె= కోవెలలకు దొఱికె గూటి–తావు నీ మందిరమున ॥ జూడ ॥ 3. పిచ్చుకలకు దొఱికె స్థలము -ముచ్చట బలిపీఠ మెదుట = పెట్టు కుతూహలముతోను- పిల్లల నవి మందిరమున ॥ జూడ ॥ 4. నీదు మందిరంబులోన - నిత్యవాసులైన వారు= నిక్కముగను ధన్యులగుచు-నిన్ను సన్నుతింతు రహా ॥ జూడ ॥ 5. ప్రభుని వలన బలమునొందు- ప్రజలు ధన్యులగుదు రిల= ప్రాణ ప్రియము యాత్ర సేయు- ప్రజల మార్గ మమర ధరను ॥ జూడ ॥ 6. నీదు యావరణములలో- నేను నొక్క దినము గడుప-నెంతో విలువ గలుగు నాకు-వేయినాళ్ల బ్రతుకు కన్న ॥ జూడ ॥ 7. కాన రండు మనము నిపుడే మనము లలర ప్రభుని జూడ= మందిర మునకేగి నిండు-మనశ్శాంతి బొంది బ్రతుక ॥ జూడ ॥ ––ఎం.జె. రామాంజులు Chooda goredha -nee-mandi raavaranamulanu choodagoreda = chooda naaku na...