కరుణ కటాక్షము గల యేసయ్యా Lyrics | Karuna Katakshamu Gala Yesayya Telugu Christian Song
కరుణ కటాక్షము గల యేసయ్యా Lyrics – Karuna Katakshamu Gala Yesayya Telugu Christian Song కరుణ కటాక్షము గల యేసయ్యా తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం Lyrics కరుణ కటాక్షము గల యేసయ్యా నను విస్తరింపజేయు మహనీయ దివ్య సుందరమ - దయకు నిలయమ దివిలో కాంతితేజమా పరిమళ నామమ - ప్రేమకు నిలయమ పరిశుద్ధ స్తుతి గానమా ఏమున్నదనీ నాపై లక్ష్యముంచినావు ఆదరించి ప్రేమించి కటాక్షించినావు నీ రెక్కల నీడే సురక్షితం నీ పాద సన్నిధె క్షేమము కృపవెంబడి కృపను - నిత్యమైన ప్రేమను అధికమైన మహిమను విస్తరింపజేసావు నేనెంతటి వాడనని ఇంతగ హెచ్చించావు ఏలుటకు ఎన్నుకొని అభిషేకించావు నీ ఇష్టునిగా నివసించెదను నీ ఉద్దేశము నే మరువను కృపవెంబడి కృపను - నిత్యమైన ప్రేమను అధికమైన మహిమను విస్తరింపజేసావు ఏ యోగ్యత లేని నాకు తోడుగ నిలిచావు నింద అవమానములో ఘనతనిచ్చినావు నీ నడిపింపుకు లోబడితిని నీ స్వాస్థ్యముకై వేచియుంటిని కృపవెంబడి కృపను - నిత్యమైన ప్రేమను అధికమైన మహిమను విస్తరింపజేసావు