Posts

Showing posts with the label ద

Dinamu Gatiyinchenu | దినము గతియించెను | Andhra Kraistava Keerthanalu

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.51 - సాయంతన స్తవము దినము గతియించెను-దిన నాధుడ పరాద్రి- వెనుకడాగె-నికమా- మునిమాపు సంస్తవముగొనుము సంప్రీతిమై-ఘనుడ దేవా ॥ దినము ॥ 1. సరవి నంబరవీధి - సంజ కెంజాయలు- మురువుజూపె- ప్రభువా- దొరయు నీ ముఖకాంతి-కిరణ జాలము మాపై-నెఱప రమ్ము ॥ దినము ॥ 2. కటికిచీకటులు ది-క్తటముల గలిసియు-త్కటములైన-నీ-చెం- గట నున్న నెట్టి సం-కటమేని మమ్ము- దాకుటకు జంకు ॥ దినము ॥ 3. తలపు వలనను నోటి-పలుకు వలనను జెనటి-పనులవల్ల-మేము- వలసి చేసిన పాప-ముల నెల్ల క్షమియింపు-మ లఘుక్షాంతి దినము ॥ దినము ॥ 4. మమ్మురమ్మగు శోధ- నమ్ములపై విజ-యమ్ము నొందనీ- దినమ్ము మాకు సామర్థ్య మొసగితివి వంద-నమ్ము దేవ ॥ దినము ॥ 5. ఈ దినము మాకు స-మ్మోదంబుతో నిచ్చి- యాదుకొన్న- వరమౌ నీ దివ్యదానముల-కై దేవ! మాకృత-జ్ఞతను గొమ్ము ॥ దినము ॥ 6. అలసిన మా దేహములకు వలసిన నిదుర గలుగజేసి - నీ దూ-తల హస్తములలో మ-మ్ములను దాచుము భద్ర-ముగను దేవ ॥ దినము ॥ 7. అరుణోదయమున ని-న్నర్చించు కొఱకు నీ-కరము సాచి-మమ్ము- త్వరగా మేల్కొల్పుము-స్వాస్థ్య ప్రదాతవై-పరమదేవ ॥ దినము ॥ 8. దాత వీవె లోక- త్రాత-వీవె మాకు-నేత వీవె-యేసు-న...

Deva Neeku Stotramu | దేవ నీకు స్తోత్రము | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.50 - సాయం ప్రార్థన దేవ నీకు స్తోత్రము- ఈ రాత్రిలో -నీ వెలుగు దీవెనకై=కావుము నన్నిప్పుడు -రాజుల రాజా- ప్రోవు రెక్కల నీడలో ॥ దేవ ॥ 1. పూని యేసుని పేరిటన్-మన్నించుము-కాని పనులను జేసినన్= నేను నిదురపోవక ముందే సమా=ధాన మిమ్ము నాకు ॥ దేవ ॥ 2. చావు నొందు కెన్నడు-భీతి లేక-జీవింప నేర్పించుము-జీవ పునరుత్థానము -లో మహిమతో- లేవ మడియ నడ్పుము ॥ దేవ ॥ 3. నేను జీకటి నిద్రను- రోయుచు దుద-లేని దినంబునందు= మాన కుండగ దూతలన్-గూడి చేయ-గాన మెప్పుడు గల్గునో ॥ దేవ ॥ ––మత్తయి సమూయేలు Deva neeku stotramu- Ee raatrilo- Nee velugu deevenakai= Kaavumu Nannippudu-Raajula Raajaa-Provu rekkala needalo || Deva || 1. Pooni Yesuni peritan-manninchumu-Kaani panulanu jesinan= Nenu nidurapovaka munde sama=dhaana mimmu naaku || Deva || 2. Chaavu nondu kennadu-bheethi leka-jeevimpa nerpinchumu-Jeeva punarutthaanamu-lo mahimato-leva madiya nadpumu || Deva || 3. Nenu jeekati nidranu-royuchu duda-leni dinambunandu= Maana kundaga dootalan-goodi jeya-gaana ...

Dahana Bali Neeku | దహన బలి నీకు | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.32 - అర్పణ కీర్తన దహన బలి నీకు ననిష్టము- మరియు-దైవ బలులు విరిగిన యాత్మలే=యెహోవ దేవ విరిగి నలిగిన-యట్టి-హృదయం బలక్ష్యంబు సేయవు ॥ దహన ॥ 1. నీ కటాక్షముతో సీయోనున-కిపుడే-నెనరుతోడను మేలు చేయుమి= ప్రాకటంబుగను యెరూషలే-మునకుం- ప్రాకారములను గట్టించుమి ॥ దహన ॥ 2. అంతట నీతి యుక్తంబు లౌ-బలులు- యాగములు సర్వాంగ హోమముల్= ఎంతో యిష్టంబౌ బలిపీఠము-మీంద -నెన్నో కోడెల జనులర్పింతురు ॥ దహన ॥ ––మల్లెల దావీదు Dahana bali neeku nanishtamu- mariyu-daiva balulu virigina Yaathmale=Yehova deeva virigi naligina-yatti-hrudayam balakshyambu Seeyavu || Dahana || 1. Nee kataakshamutho Seeyonuna-kipude-nenaruthodanu meelu cheeyumi= Praakatambuganu Yeroosaale-munakum- praakaaramulanu gattinchumi || Dahana || 2. Anthata neethi yukthambu lau-balulu- yaagamulu sarvaanga Homamul= entho yishtambau balipeethamu-meenda -nenno kodela Janularpinthuru || Dahana || ––Mallela Daaveedu

Deevaa Divyaanantha Prabhaava | దేవా దివ్యానంత ప్రభావ | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.4 - దేవుని యనూనత్వములు దేవా దివ్యానంత ప్ర-భావ- మాంపాహి ఘన యెహోవా= స్థావర జంగమ -సహిత నిఖిల జగ-దావన పావన-భావ నిరంతర ॥ దేవా ॥ 1. సార-కారుణ్య పారా-వారా - సర్వజ్ఞ నిర్వి-కారా- యేసు నామావ- తారా- దీన జనోప-కారా=ఘోరమైన సం-సారాటవిబడి- దారిగనని నను జేరబిలిచితివి ॥ దేవా ॥ 2. అక్షీ-ణ విభవానంద - మోక్ష- రాజ్య మహిమా ధ్యక్ష సంతత సుజన-రక్షా- కపట దుర్మనుజ-శిక్షా= పక్ష విపక్ష వి-లక్షణ రహిత క-టాక్షము నాదెస- దీక్షను నిలుపవె ॥ దేవా ॥ 3. సుంద-రాశ్చర్య గుణ-బృందా బంధుర నిత్యా-నందా-సాధు సజ్జన- వంద్యా-ఖండిత కలుష-బృందా= మంద మతిని నా-డెందము కడు దెలి వొంద జేసి నీ యందు నిలుపగదె ॥ దేవా ॥ 4. నీవు - నన్ను సృష్టించి -నావు - నాగురురాద్దేవుడవు-క్రీస్తు యేసుని- చావు - వలన నన్మనిపి-నావు= పావన జనక సు-తాత్మలతోడను- గేవల మొక్కడ-వై వెలిగెడి ప్రభు ॥ దేవా ॥ 5. ప్రేమ స్వరూప నిత్య- క్షేమ-పతిత పావన నామ -దాస లోకాబ్డి సోమ-సర్వేశ పరమ-ధామ= నేమ మెఱుంగని- నీచుడ నధముడ- నోమహాత్మ దయ-తో మన్నింపవె ॥ దేవా ॥ ––పురుషోత్తము చౌధరి Deevaa divyaanantha pra-bhaava- maampaahi ghana...

Duppilanti Jeevitham Lyrics | దుప్పిలాంటి జీవితం

Image
Duppilanti Jeevitham Lyrics | దుప్పిలాంటి జీవితం దుప్పిలాంటి జీవితం దుప్పిలాంటి జీవితం కడవరకు కలయెగా నా ప్రాణం నీకే అంకితం........ (2) జీవము గల దేవా నీ సన్నిధిని నే చేరేదను ప్రాణమిచ్చిన దేవా నీతోనే నే ఉండెదను నా ప్రాణమా... కరిగిపోకుమా నా హృదయమా కృంగిపోకుమా నా ప్రాణమా కరిగిపోకుమా నా హృదయమా... ఓ...ఓ... (2) ||దుప్పిలాంటి|| నా కన్నులు ఆత్మల కోసం కన్నీరు కార్చాలి ఆ కన్నులు నావే కానీ, చూపు నీదై ఉండాలి (2) పెదవులు నావైతే కానీ మాటలు నీవై ఉండాలి హృదయం నాదైతే కానీ స్పందన నీదై ఉండాలి ..(2) ||నా ప్రాణమా కరిగిపోకుమా|| నా ఆత్మ నీకోసం ప్రజ్వరిల్లాలి నా ఆయువు నీలోనే అంతం అవ్వాలి (2) నా హృదయంలో నీ ప్రేమ ప్రవహించాలి నా తుది శ్వాసవరకు నువ్వే నాకు కావాలి .. (2) ||నా ప్రాణమా కరిగిపోకుమా|| ధూళిలాంటి జీవితం కడవరకు కలయెగా నా ప్రాణం నీకే అంకితం.... (2) జీవము గల దేవా నీ సన్నిధిని నే చేరేదను ప్రాణమిచ్చిన దేవా నీతోనే నే ఉండెదను నా ప్రాణమా కరిగిపోకుమా నా హృదయమా కృంగిపోకుమా... ఓ.. ఓ.....

దేవా ఈ జీవితం... నీకంకితం | Deva Ee Jeevitham Neekankitham Telugu Christian Song Lyrics

Image
 దేవా ఈ జీవితం... నీకంకితం తెలుగు క్రైస్తవ పాట లిరిక్స్ కష్టాల్లోనూ, నష్టాల్లోనూ దేవునితోనే నడిచే విశ్వాసాన్ని తెలియజేసే అద్భుతమైన తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం. "దేవా ఈ జీవితం... నీకంకితం" అనేది దేవునికి సంపూర్ణంగా అంకితమైన జీవితాన్ని ప్రతిబింబించే హృదయాన్ని హత్తుకునే తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం. ఎన్ని కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు ఎదురైనా దేవుని ప్రేమ, వాక్యం, మార్గదర్శకత్వంతో ముందుకు సాగాలనే విశ్వాసాన్ని ఈ పాట తెలియజేస్తుంది. ఈ పేజీలో పూర్తి తెలుగు లిరిక్స్‌ను సులభంగా చదవడానికి అందిస్తున్నాము. దేవా ఈ జీవితం... నీకంకితం (2) ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం వ్యాధి బాధలైనా శోక సంద్రమైనా నీతోనే నా జీవితం (2) నీ ప్రేమను చూపించి – నీ కౌగిటిలో చేర్చి నీ మార్గమునే నాకు చూపినావు (2) నీతోనే నడచి – నీలోనే జీవించి నీతోనే సాగెదను (2) నా త్రోవకు వెలుగై – పాదములకు దీపమై నీ వాక్యమే నను నడిపెను (2) నీతోనే నడచి – నీలోనే జీవించి నీతోనే సాగెదను (2)  దేవా ఈ జీవితం నీకంకితం లిరిక్స్, Deva Ee Jeevitham Lyrics, Deva Ee Jeevitham Neekankitham Lyrics, Telugu Christian Song Lyrics,...

The Saviour Telugu Song Lyrics | యేసు రక్షకుడు తెలుగు క్రైస్తవ గీతం లిరిక్స్

Image
The Saviour – యేసు రక్షకుడు | Telugu Christian Song Lyrics The Saviour – యేసు రక్షకుడు పాట లిరిక్స్ The Saviour - నా పాప భారమును మోసినవాడు The Warrior - నా గెలుపు కోసం దెబ్బతిన్నవాడు The Lover – ఆయన ప్రేమను చూపించినవాడు The King – ప్రజల రాజ్యాన్ని గెలిచినవాడు యేసు - యేసు - యేసు - యేసు చరణం :- 1 The prince of peace సమస్యల్లో సమాధానం తెచ్చినవాడు The Everlasting Father వారసత్వములో అభయ హస్తమొందినవాడు The Warrior శత్రుచేతినుండి నన్ను విడిపించినవాడు The Saviour ప్రాణాలు తెగించినవాడు యేసు రక్షకుడు - యేసు రాజు యేసు నా ప్రియుడు - యేసు దేవుడు చరణం :- 2 ఆయన వాక్యము - వాక్యము దేవుడు దేవుడు వాక్యము - కృపాసత్యసంపూర్ణుడు వాక్కు జీవమై జీవించేసి వెలిగించి మనలని నడిపించును ప్రేమమయుడు జీవనధాత – The Saviour ప్రాణాలు తెగించినవాడు యేసు రక్షకుడు - యేసు రాజు యేసు నా ప్రియుడు - యేసు దేవుడు

Doota paata paadudi | దూత పాట పాడుడి | Christmas Song Lyrics Telugu

Image
దూత పాట పాడుడి | Doota paata paadudi | Christmas Song Lyrics Telugu | Jesus Song Lyrics | Download దూత పాట పాడుడి దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి ఆ ప్రభుండు పుట్టెను – బెత్లెహేము నందున భూజనంబు కెల్లను – సౌఖ్య సంభ్రమాయెను ఆకసంబు నందున – మ్రోగు పాట చాటుడి దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి ఊర్ధ్వ లోకమందున – గొల్వగాను శుద్దులు అంత్య కాలమందున – కన్య గర్భమందున బుట్టినట్టి రక్షకా – ఓ ఇమ్మానుయేల్ ప్రభో ఓ నరావతారుడా – నిన్ను నెన్న శక్యమా దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి రావే నీతి సూర్యుడా – రావే దేవా పుత్రుడా నీదు రాక వల్లను – లోక సౌఖ్య మాయెను భూ నివాసులందరూ – మృత్యు భీతి గెల్తురు నిన్ను నమ్ము వారికి – ఆత్మ శుద్ది కల్గును దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి

Divilo veduka - oorantaa panduga | దివిలో వేడుక - ఊరంతా పండుగ | Christmas Song Lyrics Telugu 2024

Image
దివిలో వేడుక - ఊరంతా పండుగ | Divilo veduka - oorantaa panduga | Christmas Song Lyrics Telugu | Jesus Christmas Song Lyrics Telugu | Download దివిలో వేడుక - ఊరంతా పండుగ దివిలో వేడుక - ఊరంతా పండుగ - నేడే రారాజు పుట్టెనే ఇలలో జాడగా - ఆ నింగీ తారక - వెలిసే ఈ వింత చూపగా మహా సంతోషమే - ఆహా ఆనందమే ఆహా ఈ రేయిలో - ఓహో ఉల్లాసమే ఇల మెస్సయ్య - జన్మించినాడుగా మన యేసయ్య - ఉదయించినాడుగా మహారాజు - మన యేసు నిన్నే కోరీ - ఇలా వచ్చెనే జగాలేలే - మన యేసు నిన్నే చేర - దిగి వచ్చెనే 1. దేవ దేవుడే - మరియ తనయుడై      ధరలో దీనుడై - పుట్టే పుణ్యుడై      పరిశుద్ధాత్ముడే - పాపరహితుడై      ప్రేమపూర్ణుడే - పరమ జీవమై      లోకాన్ని వెలిగించ వచ్చాడుగా      నిను దీవించి తన ప్రేమ చూపాడుగా      దారే చూపంగ దేవుడే      దయతో దీపంగ నిలిచెనే 2. ఆడే గొల్లలు - పాడే దూతలు      వచ్చిరి జ్ఞానులు - వేడిరి యేసుని  ...

దేవదూత క్రిస్మసు | Telugu Christian ChriDevadootha Krismasu | stmas Song Lyrics Download

Image
దేవదూత క్రిస్మసు | Devadootha Krismasu | Telugu Christian Christmas Song Lyrics Download | Bible Mission Song Lyrics Christmas SONG NO. 23 దేవదూత క్రిస్మసు 1. దేవదూత క్రిస్మసు....... దూత సేన క్రిస్మసు      గొల్లవారి క్రిస్మసు....... తూర్పుజ్ఞాని క్రిస్మసు 2. చిన్నవారి క్రిస్మసు....... పెద్దవారి క్రిస్మసు      పేద వారి క్రిస్మసు....... గొప్పవారి క్రిస్మసు 3. పల్లెయందు క్రిస్మసు....... పట్నమందు క్రిస్మసు      దేశమందు క్రిస్మసు....... లోకమంత క్రిస్మసు 4. క్రిస్మసన్న పండుగ........ చేసికొన్న మెండుగ      మానవాత్మ నిండుగ....... చేయకున్న దండుగ 5. క్రీస్తు దేవదానము......... దేవవాక్య ధ్యానము      క్రీస్తు శిష్యగానము.......... వీనికాత్మ స్థానము 6. కన్నవారి క్రిస్మసు........ విన్నవారి క్రిస్మసు      క్రైస్తవాళి క్రిస్మసు........ ఎల్లవారి క్రిస్మసు 7. పాపలోకమందున........ క్రీస్తు పుట్టినందున      పాపికెంతో మోక్షము........ ఈ సువార్త సాక్ష్యము 8. క్రీస్తే సర్వభూపతి........ నమ్మువారి సద్గతి ...

Deva Lokamunundi Uyyalo | దేవ లోకమునుండి ఉయ్యాలో | Christmas Song Lyrics Telugu

Image
దేవ లోకమునుండి ఉయ్యాలో | Deva Lokamunundi Uyyalo | Christmas Song Lyrics Telugu | Bible Mission Songs Lyrics | Download SONG NO. 22 దేవ లోకమునుండి ఉయ్యాలో దేవ లోకమునుండి ఉయ్యాలో దేవదూతలు వచ్చి రుయ్యాలో 1. దేవలోకం బెల్ల ఉయ్యాలో........ తేజరిల్లిపోయె ఉయ్యాలో 2. గగన మార్గంబెల్ల ఉయ్యాలో........ గణగణ మ్రోగెను ఉయ్యాలో 3. లోకము పరలోకము ఉయ్యాలో........ యేకమై పోయెను ఉయ్యాలో 4. పరలోక దేవుండు ఉయ్యాలో........ ధరణిపై బుట్టెను ఉయ్యాలో 5. మహిమ బాలుండడిగో ఉయ్యాలో........ మరియమ్మ ఒడిలోన ఉయ్యాలో 6. సృష్టికర్త యడిగో ఉయ్యాలో........ శిశువుగా నున్నాడు ఉయ్యాలో 7. పశువుల తొట్టిదిగో ఉయ్యాలో.......పసి పాలకుండడిగో ఉయ్యాలో 8. బాలరాజునకు ఉయ్యాలో....... పాటలు పాడండి ఉయ్యాలో 9. బాలరక్షకునికి ఉయ్యాలో....... స్తోత్రములు చేయండి ఉయ్యాలో 10. పరలోకమంతట ఉయ్యాలో....... పరమ సంతోషమే ఉయ్యాలో 11. నాతండ్రి నాకోసం ఉయ్యాలో....... నరుడుగా బుట్టెను ఉయ్యాలో 12. ముద్దు పెట్టుకొనుడి ఉయ్యాలో........ ముచ్చట తీరంగ ఉయ్యాలో 13. మురియుచు వేయండి ఉయ్యాలో....... ముత్యాల హారములు ఉయ్యాలో 14. గొల్లబోయ లొచ్చి రుయ్యాలో....... గొప్పగ మురిస...

Devaloka Stotraganam | దేవలోక స్తోత్రగానమ్ | Bible Mission Christmas Song Lyrics

Image
దేవలోక స్తోత్రగానమ్ | Devaloka Stotraganam | Bible Mission Christmas Song Lyrics | Telugu Christian Song Lyrics | Download SONG NO. 21 దేవలోక స్తోత్రగానమ్ దేవలోక స్తోత్రగానమ్ - దేవాది - దేవునికి నిత్య దానమ్  - దేవలోక స్తోత్రగానమ్ - దీనులకు సుజ్ఞానం - గావించు  వర్తమానమ్ - క్రైస్తవాళి కాలమానమ్  - క్రిస్మస్ జయ్ జయ్      || దేవ || 1. భూమికిన్ శాంతి దానమ్ - స్తోత్రంబు - పూర్తి చేయగల       విధానం = భూమికిన్ శాంతి దానమ్ - బొందు దేవవేష్ట       జనం - క్షేమము సమాధానమ్ - క్రీస్తు శిష్య       కాలమానమ్ - క్రిస్మస్ జయ్ జయ్      || దేవ || 2. సర్వలోక రక్షణార్ధమ్ - ఈ వార్త - చాటించుట       ప్రధానమ్ = సర్వ లోక రక్షణార్ధమ్ - చాటించుట       ప్రధానమ్ - సర్వదేవ సన్నిధానమ్ సర్వలోక       కాలమానమ్ - క్రిస్మస్ జయ్ జయ్      || దేవ || 3. దేవలోక సంస్థానమ్ - మహోన్నత - దేవుని మహిమ       స్థానమ్ = దేవలోక సంస్థానమ్ - ...

Deva Stotraganamulu Pai Divya Sthalamulo | దేవ స్తోత్రగానముల్ పై దివ్య స్థలములో | Telugu Christian Song Lyrics

Image
దేవ స్తోత్రగానముల్ పై దివ్య స్థలములో | Deva Stotraganamulu Pai Divya Sthalamulo | Telugu Christian Song Lyrics | Bible Mission Christmas Song Lyrics | Download SONG NO. 20 దేవ స్తోత్రగానముల్ పై దివ్య స్థలములో దేవ స్తోత్రగానముల్ పై - దివ్య స్థలములో - దేవమారు  గానముల్ భూ - దేశ స్థలములో = దేవలోక  పావనులును - దీన నరులును బోవ జూడ - భువి దివి క్రిస్మస్ || దేవ || 1. అవ్వకిచ్చినట్టి వాక్కు - అదిగో తొట్టిలో - పవ్వళించి       యున్న దేవ బాల యేసులో = ఇవ్విధముగ        ఫలమాయే - ఈదినంబున నవ్వుమోము - నరుని కబ్బెను || దేవ || 2. షేము దేవ వందనంబు - చెప్పబడియెను భూమి       స్తుతుల నందు కొనెడి - పూజనీయుడు = భూమిపైన       నరుడుగాను - బుట్టవచ్చెను భూమి క్రిస్మస్ - భోగమొందెను || దేవ || 3. అందరి వంశంబులు నీ - యందు దీవెన - బొందునంచు       నబ్రామునకు నందెనువాక్కు = అందె క్రీస్తు       యూదులకును అన్యజనులకున్ విందు క్రిస్మస్ - విశ్వమంతటన్ || దేవ || 4. షీలో వచ్చువరకు యూ - దాలో న...

Deva Deva Deva Divi Nunna Devaa | దేవ దేవ దేవ దివి నున్న దేవా | Christmas Song Lyrics Telugu

Image
దేవ దేవ దేవ దివి నున్న దేవా | Deva Deva Deva Divi Nunna Devaa | Christmas Song Lyrics Telugu | Bible Mission Song Lyrics | Download SONG NO. 19 దేవ దేవ దేవ దివి నున్న దేవా దేవ దేవ దేవ - దివి నున్న దేవా! - పావన స్తోత్రముల్  - పరలోక దేవా దేవ 1. అన్ని లోకములకు - అవతలనున్న = ఉన్నత లోకాన       సన్నుతులుగొన్న దేవ      || దేవ || 2. మహిమ లోకంబున - మహిమ పూర్ణముగ =       మహనీయముగ నుండు - మానకుండగను దేవ      || దేవ || 3. నీ కిష్టులైనట్టి - లోకవాసులకు = రాకమానదు శాంతి       రంజిల్లు వరకు దేవ      || దేవ || 4. ధరణి మీదను - సమాధానంబు కలుగు = నరులకు       నీదర్శనం బిచట కలుగు దేవ      || దేవ || 5. వధువు సంఘమునకు బాలుండు పుట్టు = వృధిని       సువార్తకు పెరుగుట పట్టు దేవ      || దేవ || 6. ప్రసవవేదన పొంది - వధువు సభ అరసె = అసలైన       మగబిడ్డ అదునుకు వెలసె దేవ      || దేవ ||

దేవా మేము నమ్మదగిన | Devaa Memu nammadagina | Telugu Christian Song Lyrics

Image
దేవా మేము నమ్మదగిన | Devaa Memu nammadagina | Telugu Christian Song Lyrics | Bible Mission Songs | Download SONG NO. 15 దేవా మేము నమ్మదగిన దేవా! మేము నమ్మదగిన వారమా - సృష్టి కర్తా! నరుల  హృదయము - నందు నీకు స్తోత్ర గీతము      || దేవా మేము || 1. నాలోని అవిశ్వాసము పో - గొట్టు దేవుడవు =      నా సందేహమును - అణచునట్టి దేవుడవు || దేవా మేము || 2. నాలోపుట్టు సంశయము మా - న్పించు దేవుడవు =      అపనమ్మికను నిర్మూల - పరచునట్టి కర్తవు      || దేవా మేము || 3. అనుమానము లేకుండా - జేయు ఆత్మవు =      వెనుకాడు గుణము బెరికి - వేయు విజయశాలివి      || దేవా మేము || 4. నీ ప్రేమను నమ్మని నైజము - కూల్చు తండ్రివి =      నీ శక్తిని నమ్మని బుద్ధిని పరిమార్చు ప - రాక్రమ శాలివి || దేవా మేము || 5. అవిశ్వాసపు సంగతులు - దహించు అగ్నివి =      అవి నాలోనుండి తీసివేయు వి - శ్వాస పాత్రుడవు      || దేవా మేము || 6. క్రీస్తునుబట్టి ఈ మేలు - చేయు దేవా! =      నా హృదయము నిం...

Deva Neeve - Stotra Patrudavu | దేవా నీవే - స్తోత్ర పాత్రుడవు | Bible Mission Song Lyrics Telugu

Image
దేవా నీవే - స్తోత్ర పాత్రుడవు | Deva Neeve - Stotra Patrudavu | Bible Mission Song Lyrics Telugu | Jesus Christ Song Lyrics | Download   SONG NO. 14 దేవా! నీవే - స్తోత్ర పాత్రుడవు దేవా! నీవే - స్తోత్ర పాత్రుడవు నీవు మాత్రమే - మహిమ రూపివి                                                                                                      || దేవా నీవే || 1. కాబట్టి నేను నిన్ను స్తు - తించు చున్నాను = నిన్ను       స్తుతించు స్తుతినే - యెంచు కొనుచున్నాను      || దేవా నీవే || 2. దేవదూతలు నిన్ను స్తు - తించు చున్నారు = వారే       మహిమతో స్తో - త్రించుచున్నారు      || దేవా నీవే || 3. పరలోక పరిశుద్ధులు నిన్ను స్తు - ...

Daivatma Rammu | దైవాత్మా రమ్ము | Bible Mission Songs Lyrics

Image
దైవాత్మా రమ్ము | Daivatma Rammu | Bible Mission Songs Lyrics | Telugu Christian Song Lyrics Download SONG NO. 09 దైవాత్మా రమ్ము దైవాత్మా రమ్ము - నా తనువున వ్రాలుము - నా =  జీవమంతయు నీతో నిండ - జేరి వసింపుము      || దైవాత్మా || 1. స్వంత బుద్ధితోను - యేసు - ప్రభుని నెఱుగలేను - నే = నెం      తగ నాలోచించిన విభుని - నెఱిగి చూడ లేను      || దైవాత్మా || 2. స్వంత శక్తితోను - యేసు - స్వామి జేరలేను - నే =       నెంత నడచిన ప్రభుని కలిసికొని - చెంత జేరలేను      || దైవాత్మా || 3. పాప స్థలము నుండి - నీ సు - వార్త కడకు నన్ను - భువి       నో = పరమాత్మ! నడుపు చుండుము - ఉత్తమ స్థలమునకు      || దైవాత్మా || 4. పాపములో మరల - నన్ను పడకుండగ జేసి - ఆ నీ =       పరిశుద్ధమైన రెక్కల - నీడను కాపాడు      || దైవాత్మా || 5. పరిశుద్ధుని జేసి - నీ - వరములు దయచేసి - నీ =       పరిశుద్ధ సన్నిధిని జూపుమా - పావురమా! వినుమా      || ...

Deva Yehovah Stuti Pathrundu | దేవ యెహోవా స్తుతి పాత్రుండ | Bible Mission Song Lyrics Telugu

Image
దేవ యెహోవా స్తుతి పాత్రుండ | Deva Yehovah Stuti Pathrundu | Bible Mission Song Lyrics Telugu | Christian Song Lyrics Telugu | Download SONG NO. 08 దేవ యెహోవా స్తుతి పాత్రుండ దేవ యెహోవా! స్తుతి పాత్రుండ! - పరిశుద్ధాలయ  పరమ నివాసా!      || దేవ || 1. బలమును కీర్తియు శక్తి ప్రసిద్ధత - సర్వము నీవే =       సకల ప్రాణులు స్తుతి చెల్లించగ - సర్వద నిను స్తుతు -       లొనరించగనున్న      | | దేవ || 2. నీదు పరాక్రమ కార్యములన్నియు - నిరతము నీవే =       నీదు ప్రభావ మహాత్యము లన్నియు - నిత్యము       పొగడగ నిరతము స్తోత్రములే      || దేవ || 3. స్వర మండల సితారలతోను - బూరల ధ్వనితో =       తంబురలతో నాట్యము లాడుచు - నిను       స్తుతియించుచు - స్తోత్రము జేసెదము      || దేవ || 4. తంతి వాద్య పిల్లన గ్రోవి - మ్రోగెడు తాళము = గంభీర       ధ్వని గల తాళములతో - ఘనుడగు దేవుని కీర్తించను     ...

Devaa Tandri Neeku | దేవా తండ్రీ నీకు | Bible Mission Christian Song Lyrics Telugu | Download

Image
దేవా తండ్రీ నీకు | Devaa Tandri Neeku | Bible Mission Christian Song Lyrics Telugu | Download దేవా తండ్రీ నీకు SONG NO. 03      దేవా తండ్రీ నీకు - దిన దిన స్తుతులు = నావిన్నపము విన్న నాధా సంస్తుతులు  1. అపవిత్రాత్మల దర్శన - మాపియున్నావు = ఎపుడైన అవి నా - కేసి రానీయవు|| దేవా ||  2. చెడ్డ ఆత్మల మాటల్ - చెవిని బడనీయవు = గడ్డు పలుకుల నోళ్ళు - గట్టియున్నావు|| దేవా ||  3. చెడు తలంపులు పుట్టిం - చెడి దుష్టాత్మలను నా = కడకు రానీయవు - కదల నీయవు|| దేవా ||  4. పాపంబులను దూర - పరచి యున్నావు = పాపంబులను గెల్చు - బలమిచ్చినావు|| దేవా ||  5. పాప ఫలితము లెల్ల - పారదోలితివి = శాప సాధనములు - ఆపివేసితివి || దేవా ||  6. దురిత నైజపు వేరు - పెరికి యున్నావు = పరిశుద్ధ నైజ సం - పద యిచ్చినావు|| దేవా ||  7. ప్రతి వ్యాధినిన్ స్వస్థ - పరచి యున్నావు = మతికి ఆత్మకును నె - మ్మది యిచ్చినావు|| దేవా ||  8. అన్న వస్త్రాదుల - కాధార మీవె = అన్ని చిక్కులలో స - హాయుండ వీవే|| దేవా ||  9. ననుగావ గల దూత - లను నుంచినావు = నిను నమ్ము విశ్వాస - మును నిచ్చినావు|| దేవా ...

Divinncumu deva ma kutumbamunu | దీవించుము దేవా మా కుటుంబమును | Telugu Christian Song Lyrics

Image
దీవించుము దేవా మా కుటుంబమును |  Divinncumu deva ma kutumbamunu | Telugu Christian Song Lyrics | Youtube నీ ఆశీర్వాదం పొందిన కుటుంబం నీ ఆశీర్వాదం పొందిన కుటుంబం  నీ సన్నిధిలోనే నిత్యము స్థిరపరచుము  నీ చిత్తము నెరవేర్చుటయే నా జీవితం  నీ పాదముల చెంత చేసెద అంకితం  దీవించుము దేవా మా కుటుంబమును  నీ దీవెన తరతరములకుండును  దీవించుము దేవా మా పిల్లలను  నీ దీవెన తరతరములకుండును  1. ఎన్నిక లేని నన్ను హెచ్చించితివి       దీనుడనైన నన్ను దీవించితివి       నీ చేతి నీడలో నను ఉంచితివి       నీ రక్షణలో నను కాపాడితివి       నీ అనురాగము యెంతో గొప్పది       నీ సంకల్పము యెంతో గొప్పది  2. నీ స్వరము వినే సమూయేలులా       హన్నా వలే నీ కొరకు పెంచాలయ్యా       నీ శిక్షణలో నీ బోధలో       కడవరకు వారిని వుంచాలయ్యా       నిన్నే ఆరాధించెదరు దావీదులా       నిన్నే ప్రకటించెదరు పౌ...